సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: ప్యారడైజ్ తప్పుకోవడం.. పెద్దికి ప్లస్సా.. మైనసా

ABN, Publish Date - Jan 20 , 2026 | 06:09 PM

సంక్రాంతి వార్ ముగిసింది.. ఇక సమ్మర్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి మనకో విషయాన్ని స్పష్టంగా చెప్పింది. బాక్సాఫీస్ దగ్గర కటౌట్‌లు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే, కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపితమైంది.

Peddi

Peddi: సంక్రాంతి వార్ ముగిసింది.. ఇక సమ్మర్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి మనకో విషయాన్ని స్పష్టంగా చెప్పింది. బాక్సాఫీస్ దగ్గర కటౌట్‌లు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే, కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపితమైంది. రిలీజ్ అయిన ఐదు సినిమాల్లో నాలుగు సేఫ్ జోన్‌లోకి వెళ్లడం విశేషం. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) కలెక్షన్ల సునామీ సృష్టించి మేజర్ షేర్ సొంతం చేసుకుంది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. సంక్రాంతి రేసులో సినిమాలు బాగున్నా, థియేటర్ల కేటాయింపులో జరిగిన తలనొప్పుల వల్ల కలెక్షన్లపై కొంత ప్రభావం పడింది. ఇదే పరిస్థితి ఇప్పుడు రాబోయే వేసవిలోనూ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

మార్చి నెల బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగనుంది. మార్చి 19న టాక్సిక్, డెకాయిట్, దురంధర్-2 వంటి భారీ చిత్రాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత వారం అంటే మార్చి 26, 27 తేదీల్లో అసలైన బిగ్ ఫైట్ జరగాల్సి ఉంది. ఒకవైపు నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ తో సిద్ధమవుతుంటే, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ఈ రెండు సినిమాలపై ఆడియెన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి తలపడితే కలెక్షన్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ది ప్యారడైజ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ఆ సమయంలో ఏదో ఒక సినిమా మాత్రమే వస్తుందని, క్లాష్ అయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే, ప్యారడైజ్ వెనక్కి తగ్గే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

దీనికి కారణం కేవలం క్లాష్ మాత్రమే కాదు, ప్యారడైజ్ షూటింగ్ ఇంకా కొంత బ్యాలెన్స్ ఉండటమేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావడానికి సమయం పట్టేలా ఉంది. ఇదే గనుక నిజమైతే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి బాక్సాఫీస్ దగ్గర లైన్ క్లియర్ అయినట్లే! పెద్ది సినిమా ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రమోషన్ల విషయంలోనూ చిత్ర యూనిట్ చాలా స్పీడుగా ఉంది.

చివరిగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒకవేళ ప్యారడైజ్ వాయిదా పడినా, పెద్ది సినిమాకి అంత ఈజీగా ఏమీ ఉండదు. ఎందుకంటే అంతకుముందు వారమే విడుదలయ్యే టాక్సిక్, డెకాయిట్, దురంధర్‌2 లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి చరణ్ బరిలోకి దిగుతాడా!? లేక పోటీ ఎందుకని వెనక్కి తగ్గుతాడా!? అసలు రానున్న సమ్మర్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారు..? అనేది చూడాల్సి ఉంది.

Updated Date - Jan 20 , 2026 | 06:09 PM