మోహన్ బాబుని సరిగ్గా వాడే డైరెక్టరే లేడా..
ABN, Publish Date - Sep 26 , 2026 | 04:36 PM
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్‌లో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్థానం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఎటువాటి అతిశయోక్తి లేదు. విలన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా, నిర్మాతగా ఆయన ఎదిగిన వైనం ఎంతో స్పూర్తిదాయకం.
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్‌లో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)స్థానం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఎటువాటి అతిశయోక్తి లేదు. విలన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా, నిర్మాతగా ఆయన ఎదిగిన వైనం ఎంతో స్పూర్తిదాయకం. ముఖ్యంగా మోహన్ బాబుని డైలాగ్ డెలివరీ కొట్టేవారు ఎవరూ లేరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల సంఖ్య తగ్గడం, నెట్టింట ఎక్కువగా ఫన్ వీడియోలు, ట్రోల్స్ రూపంలోనే కనబడటంతో మోహన్ బాబు అసలైన నటనా విశ్వరూపం పూర్తిగా తెలియకుండా పోయింది నేటి తరానికి తెలియకుండా పోయింది.
ది ప్యారడైజ్ సినిమా మరోసారి మోహన్ బాబు గతాన్ని గుర్తుచేసింది. న్యాచురల్ స్టార్ నని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ గురువారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. టాక్ ని పక్కన పెడితే.. సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది మాత్రం మోహన్ బాబు అని పక్కాగా చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ లో గాంభీర్యం తగ్గలేదు. ఈ సినిమా చూశాక మోహన్ బాబు అసలు పొటెన్షియల్ ఏంటో మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని యువతకు మైండ్ బ్లాకింగ్ అయ్యేలా స్పష్టమైంది. విలనిజంలో హుందాతనం, గొంతులో గాంభీర్యంతో షికంజా మాలిక్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. జడల్ గా నాని తన సత్తా చాటినప్పటికీ, తన సీరియస్ అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మోహన్ బాబు నానినే డామినేట్ చేశాడు.ఆయన సీన్లలోని డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి కుర్రకారు థియేటర్లలో ఈలలు, కేరింతలతో రచ్చ చేస్తున్నారు.
అయితే మోహన్ బాబులోని పూర్తి నటనను మాత్రం శ్రీకాంత్ ఓదెల వాడలేకపోయాడు అనేది కొందరి మాట. విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబుకు ఇంతకంటే మంచి రోల్ పడితే మాత్రం ఆయనను మించిన బెస్ట్ విలన్ ఇంకెవరూ ఉండరు. ప్రస్తుతం మన మేకర్స్ పవర్‌ఫుల్ విలన్ లేదా క్యారెక్టర్ రోల్స్ కోసం ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తూ ఎక్కడెక్కడి నుంచో నటులను తీసుకొస్తున్నారు. కానీ, మన దగ్గరే ఉన్న మోహన్ బాబు లాంటి సీనియర్ లెజెండ్‌ను సరిగ్గా వాడుకోవట్లేదనే మాట. అంటే.. మోహన్ బాబు వద్దకు కథలు వచ్చినా ఆయన నో చెప్పి ఉండవచ్చు. కానీ, సరైన క్యారెక్టరైజేషన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ పడితే మోహన్ బాబు స్క్రీన్‌ను ఎలా ఏలగలడో ప్యారడైజ్ చూపించింది. ఇక ఈ సినిమా ఇంపాక్ట్ తర్వాతైనా మన టాలీవుడ్ దర్శకులు మోహన్ బాబులోని నటనా విశ్వరూపాన్ని బయటకు తీసేలా, ఆయన గంభీరమైన గొంతుకు తగినట్లుగా పవర్‌ఫుల్ పాత్రలను రాస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..
నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో
ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా