'పెద్ది' సినిమాపై ఇండస్ట్రీ సైలెన్స్.. ఎందుకు
ABN, Publish Date - Jun 07 , 2026 | 03:12 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అనేది ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ.. సినిమాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. కానీ, పెద్ది (Peddi) విషయంలో మాత్రం ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయ్యింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అనేది ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ.. సినిమాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. కానీ, పెద్ది (Peddi) విషయంలో మాత్రం ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 4 న రిలీజ్ అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. అయినా కూడా కలక్షన్స్ మాత్రం అదరగొడుతోంది. మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
ఇక పెద్ది సినిమా గురించి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో సినిమా వస్తే, టాలీవుడ్‌కు చెందిన దర్శకులు, హీరోలు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. కానీ, పెద్దికి ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కొన్నిసార్లు వేరే భాషా చిత్రాలు అయినా కూడా కొంతమంది హీరోలు.. ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేసిన రోజులు ఉన్నాయి. కానీ, పెద్ది సినిమా గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు.
పెద్ది మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా రామ్ చరణ్ నటన హైలైట్ గా నిలిచింది. కెరీర్ బెస్ట్ పెర్మార్మెన్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం చరణ్ అద్భుతమైన నటన గురించి ఒక్క అప్రిసియేషన్ పోస్ట్ కానీ, కంగ్రాట్స్ అన్న మాట కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా రాకపోవడం మెగా అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఊహించని సైలెన్స్ వెనుక టాలీవుడ్‌లో అంతర్గతంగా ఏవైనా సమీకరణాలు మారాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్, రానా.. లాంటివారు కూడా పెద్ది గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ చరణ్ కి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు అనేది మరికొందరి వాదన.
హీరోలు మాత్రమే కాదు.. బుచ్చిబాబు గురువు అయిన సుకుమార్ కూడా ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఈయన కూడా పర్సనల్ గా శిష్యుడిని అభినందించాడా అనేది తెలియాల్సి ఉంది. కేవలం పెద్ది సినిమాపై ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నారు. ఇక ధురంధర్ 2 రిలీజ్ అయ్యినప్పుడు బాలీవుడ్ కూడా ఇలాగే మౌనం పాటించింది. ఇప్పుడు పెద్ది ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంది. అసలు ఇండస్ట్రీ ఇంత సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి ముందు ముందు స్టార్స్ ఎవరైనా పెద్దిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారేమో చూడాలి.