సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sudigali Sudheer: ప్రమోషన్లకు రానివాడివి నీకెందుకు సినిమాలు

ABN, Publish Date - Oct 12 , 2026 | 06:17 PM

బుల్లితెరపై ఒకవైపు ప్రముఖ హోస్ట్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), మరోవైపు వెండితెరపై హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న విషయం తెల్సిందే.

Sudigali Sudheer

బుల్లితెరపై ఒకవైపు ప్రముఖ హోస్ట్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), మరోవైపు వెండితెరపై హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గోట్(GOAT) విడుదల విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు వివాదాలు, అడ్డంకుల మధ్య చిక్కుకుని, ఎట్టకేలకు నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతోనే బ్యాచిలర్ బ్యూటీ దివ్యభారతి తెలుగుకు పరిచయమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ, డైరెక్టర్ మధ్యలోనే వదిలేయడంతో నిర్మాతనే మిగిలిన సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నాడు.


సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో సుధీర్ ఈ సినిమాను పూర్తిగా వదిలేశాడనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. సాధారణంగా హీరోలు తమ సినిమా ప్రమోషన్లలో ముందుండి నడిపిస్తారు. కానీ, ఈ చిత్రానికి సంబంధించి కేవలం హీరోయిన్ దివ్యభారతి, నిర్మాత మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. సుధీర్ మాత్రం ప్రమోషన్స్‌కు ఏమాత్రం రావడం లేదు.దానికి కారణం గతంలో హీరోయిన్ దివ్యభారతి.. సుధీర్ పై మండిపడడమే అని చెప్పుకొస్తున్నారు. సెట్ లో డైరెక్టర్ తనను చాలా ఇబ్బందిపెట్టాడని, అప్పుడు సుధీర్ చూస్తూ మౌనంగా ఉండిపోయాడని, అది హీరో లక్షణం కాదు అన్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ మాత్రమే సుధీర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు తప్ప.. ఇంకే ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.


ఇక సుధీర్ తీరుపై నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఒప్పుకున్న తర్వాత ప్రమోషన్లలో పాల్గొనకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ప్రమోషన్లకు రానివాడివి నీకెందుకు సినిమాలు? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సుధీర్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఏ సినిమాకు అయినా ఇలాంటి వివాదాలు, గొడవలు సాధారణమే. అలాంటివి పట్టించుకోకుండా సినిమాని ప్రమోషన్స్ చేయాలి కదా అని చెప్పుకొస్తున్నారు. మరి నవంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 12 , 2026 | 06:22 PM