సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు శిరీష్ రిసెప్షన్.. మేనమామలు మిస్సింగ్

ABN, Publish Date - Mar 03 , 2026 | 07:06 PM

అల్లు వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) - నయనికా రెడ్డి వివాహం మార్చి 6 న అత్యంత సన్నిహితుల మధ్య జరుగనుంది. దీంతో మార్చి 2 న వీరి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అల్లు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు.

Allu Sirish

అల్లు వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) - నయనికా రెడ్డి వివాహం మార్చి 6 న అత్యంత సన్నిహితుల మధ్య జరుగనుంది. దీంతో మార్చి 2 న వీరి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అల్లు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. అల్లు అర్జున్ బ్రదర్స్ ఈ వేడుకలో సందడి చేశారు. ఇక టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్‌,రాజేంద్ర ప్రసాద్, రామ్ చరణ్, రవితేజ, ఆలీ, నాని, రానా దగ్గుబాటి, గోపీచంద్, నవీన్ పోలిశెట్టి, మోహన్ బాబు, మంచు లక్ష్మీ, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్, సుకుమార్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా, బ్రహ్మానందం, సునీల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, మలయాళ హీరో బాసిల్ జోసెఫ్‌ తదితరులు హాజరయ్యారు.

ఇక ఎంతమంది ఉన్నా ఈ ఈవెంట్ లో ఒక లోటు కనిపించింది. అదే శిరీష్ మేనమామలు లేకపోవడం! మెగా బ్రదర్స్ ముగ్గురూ ఈ వేడుకలో కనిపించలేదు. అల్లు వారింట వేడుక అంటే మొదట ముందు ఉండేది చిరంజీవే. కానీ, ఈసారి చిరు కూడా ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. దానికి కారణం ఆయన భుజానికి సర్జరీ జరగడమే. నొప్పి ఎక్కువగా ఉండడం వలన ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని, అందుకే ఈ రిసెప్షన్ కు రాలేదని సమాచారం.

మెగా బ్రదర్ నాగబాబు వ‌చ్చి వెంట‌నే వెళ్లిపోయారు. వరుణ్ తేజ్ ఫ్యామిలీ కూడా రిసెప్షన్ లో మిస్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే నిహారిక మాత్రం శిరీష్ పెళ్లి వేడుకల్లో కనిపించి కనువిందు చేశారు.

ఇక శిరీష్ మూడో మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో మిస్ అయ్యారు. రాజకీయ పనులతో బిజీగా ఉండడం వలన పవన్ ఈ కార్యక్రమానికి మిస్ అయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన మంగళగిరిలో ఉన్నారని తెలుస్తోంది. ఇలా శిరీష్ ముగ్గురు మేనమామలు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో మిస్ అయ్యారు. వేడుక అంతా చాలా ఘనంగా జరిగింది. మేనమామలు కూడా ఉండి ఉంటే మరింత బావుండేది అని అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పెళ్ళికి అయినా మేనమామలు అటెండ్ అవుతారా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Mar 03 , 2026 | 10:53 PM