సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్యారడైజ్ టీజర్.. ఆ హాట్ బ్యూటీ ఎవరో చెప్పండయ్యా

ABN, Publish Date - Aug 07 , 2026 | 07:56 PM

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్. దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

The Paradise

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా గురువారం విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాని పవర్‌ఫుల్ జడల్ లుక్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మోహన్ బాబు విలనిజం సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశాయి. అయితే, ఈ టీజర్‌లో ఒక సాంగ్ బిట్‌లో మెరిసిన హీరోయిన్ ఎవరో తెలియక నెటిజన్లు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.


ఎవరు ఆ పాప? కన్ఫ్యూజన్‌లో నెటిజన్లు..

టీజర్‌లో ఒక పాటలో హీరోయిన్‌ను గ్లింప్స్ రూపంలో మాత్రమే చూపించారు. ముఖం స్పష్టంగా రివీల్ చేయకపోవడంతో, ఆ నటి కీర్తి సురేషా లేక కయాదు లోహరా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరు పాపా నువ్వు? అంటూ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది కయాదు లోహర్. ఆమె ఇందులో సుబ్బలక్ష్మి అనే కీలక పాత్రలో కనిపిస్తోంది. టీజర్‌లో కయాదు లోహర్‌ లుక్ ని ముందే చూపించారు. దీంతో ఆమె కయాదు కాదని కొందరు చెప్పుకొస్తున్నారు.


కీర్తి సురేష్ ఎంట్రీ నిజమేనా?

దసరా సినిమాలో నాని-కీర్తి సురేష్ కాంబోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, కీర్తి సురేష్ ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది అనే వార్తలు గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆమె ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అందుకే, టీజర్‌లో గ్లామరస్‌గా కనిపించిన హీరోయిన్ కీర్తి సురేష్ అయ్యి ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఇక టీజర్ చూసినవారందరూ ఆ పాప ఎవరో చెప్పండయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి అప్పటివరకు ఈ మిస్టరీ బ్యూటీ ఇలాగే ఉంటుందా.. లేదా మేకర్స్ రివీల్ చేస్తారా అనేది చూడాలి.

Updated Date - Aug 07 , 2026 | 07:56 PM