సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓజీ 2.. ఈసారి పవన్ తో రొమాన్స్ చేసేది ఎవరు

ABN, Publish Date - Jun 23 , 2026 | 05:43 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ (OG) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ (OG) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా 300 కోట్ల క్లబ్ లో పవన్ ని చేర్చింది. ఇక ఓజీ మొదటి భాగం సాధించిన గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో, ఇప్పుడు మేకర్స్ దీని సీక్వెల్ ఓజీ2 ను పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్, సుజీత్ కలిసి ఓజీ కథా చర్చలు ముగించారు. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ లో పవన్ సరసన నటించే బ్యూటీ ఎవరు అనేదానిమీద చర్చ నడుస్తోంది.

మొదటి భాగం లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే కథ ప్రకారం మొదటి భాగంలోనే ఆమె పాత్ర మరణించడంతో, ఇప్పుడు రాబోయే సీక్వెల్ ఓజీ2 కథ కోసం ఒక సరికొత్త హీరోయిన్ అవసరం పడింది. దీంతో ఈ సీక్వెల్‌లో పవర్ స్టార్ సరసన నటించబోయే ఆ లక్కీ బ్యూటీ ఎవరనే దానిపై టాలీవుడ్‌లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో మరింత భారీగా ప్లాన్ చేస్తుండటంతో, బాలీవుడ్‌కు చెందిన ఒక టాప్ స్టార్ హీరోయిన్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేయాలని డైరెక్టర్ సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సుజీత్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్స్ కి తోడు ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ హీరోయిన్ కూడా తోడైతే సినిమా క్రేజ్ నార్త్ బెల్ట్‌లో కూడా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది. ప్రస్తుతం పవన్ అటు రాజకీయాలని మ్యానేజ్ చేస్తూనే ఓజీ 2 చేయాలి. ఎప్పుడు ఆయన డేట్స్ ఇస్తారో తెలియదు. ఓజీ కూడా పవన్ వీలు చూసుకొని సెట్స్ కి వచ్చేవారు. అయితే ఇప్పుడు కూడా అదే జరిగితే.. ఆయన డేట్స్ కి అడ్జస్ట్ అయ్యేలా బాలీవుడ్ బ్యూటీలు డేట్స్ ఇస్తారా.. ? లేక అంతకుముందులానే సుజీత్.. మొత్తం సినిమాను ఫినిష్ చేసి.. పవన్ సీన్స్ చివర్లో చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. మరి ఓజీ పక్కన నటించే ఆ లక్కీ ఛాన్స్ ఏ బ్యూటీ అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jun 23 , 2026 | 05:44 PM