సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇవ్వాళో రేపో.. కొత్త రిలీజ్ డేట్‌! కానీ ఆ విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు

ABN, Publish Date - Apr 13 , 2026 | 07:30 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమాపై టాలీవుడ్‌లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమాపై టాలీవుడ్‌లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ తో పాటు దాదాపు మేజర్ షూటింగ్ అంతా పూర్తయింది. చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికతో అతి తక్కువ సమయంలోనే చిత్రీకరణను ముగింపు దశకు తీసుకువచ్చింది. ప్రస్తుతం టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, ఒక ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని టాక్. ఈ సాంగ్ మినహా మిగిలిన చిత్రీకరణనంతా బుచ్చిబాబు అండ్ టీమ్ విజయవంతంగా పూర్తి చేశారట. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్‌లో మెగాపవర్ స్టార్ సరసన ఎవరు ఆడిపాడతారు అనే విషయంపై చిత్ర బృందం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. లేటెస్ట్ తెలుగు సెన్షేష‌న్ మాన‌స వార‌ణాసి ఆ పాట చేయ‌నుంద‌నే వార్త వ‌చ్చినప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు మ‌రెలాంటి కొత్త స‌మాచారం లేదు. ఆ ఒక్క పాట కూడా పూర్తయితే సినిమా గుమ్మడికాయ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు.

ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కావడం లేదనే విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. షూటింగ్ వేగంగా జరిగినప్పటికీ, గ్రాఫిక్స్ మరియు ఇతర సాంకేతిక పనుల దృష్ట్యా మేకర్స్ కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నారు. రామ్ చరణ్ క్రేజ్‌కు తగ్గట్టుగా, పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ చూస్తుంటే ఇదొక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అని అర్థమవుతోంది. ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఆయన స్వరపరిచిన పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. రెహమాన్ (A R Rahman) మార్క్ మెలోడీలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది, ఇది తెలుగు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. వృద్ధి సినిమాస్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Updated Date - Apr 13 , 2026 | 10:17 AM