సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pooja Hegde: ప్రభాస్ పేరు వింటే భోజనమే గుర్తొస్తుంది.. ఆయన డ‌బ్బా దొంగిలించాలనిపిస్తుంది

ABN, Publish Date - Jul 15 , 2026 | 11:10 AM

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ భోజ‌నం గురించి హీరోయిన్ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

prabhas

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) తాజాగా ప్రభాస్ (Prabhas) గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమాలో నటించిన రోజుల‌ను గుర్తు చేసుకుంటూ ప్రభాస్ వ్యక్తిత్వం, ఆయన ఆతిథ్యం గురించి ఆమె చేసిన‌ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవ‌ల పూజా ఓ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. "ప్రభాస్ పేరు చెప్పగానే నాకు ముందుగా గుర్తొచ్చేది భోజనమే అని ఆయన భోజనాన్ని దొంగిలించాలనిపిస్తుందని అన్నారు. రాధేశ్యామ్ షూటింగ్ సమయంలో ఆయన పంపించే ఫుడ్ డబ్బా కోసం అందరం ఎదురు చూసేవార‌ని.. నాకు కూడా ప్రతిరోజూ ఎంతో రుచికరమైన వంటకాలు పంపించేవారు" అని చెప్పారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. "రాధేశ్యామ్ షూటింగ్‌కు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ వాటిలో నాకు ఎక్కువగా గుర్తుండిపోయింది ప్రభాస్ పంపించే భోజనమే. ఆయన పంపించే డబ్బా ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేది. ఎంతో ప్రేమగా అందరికీ ఆహారం పంపించేవారు. నాకు కూడా చాలా రకాల వంటకాలు తినిపించారు. ఆ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అని తెలిపారు.

ఇదిలాఉంటే.. ప్రభాస్ షూటింగ్ సెట్స్‌లో త‌న స‌మ‌చ‌ర నటులు, సాంకేతిక నిపుణులకు ఇంటి భోజనం పంపించడం కొత్త విషయం కాదు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్, శ్ర‌ద్ధా క‌పూర్, ఫృథ్వీ రాజ్ సుకుమార‌న్ వంటి స్టార్లు ఆయన ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించడంతో ప్రభాస్ అభిమానులు రాజు ఎక్క‌డ ఉన్నా రాజేరా అంటూ ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:10 AM