పెద్ది వర్సెస్ డ్రాగన్.. అబ్బే అంత లేదంట
ABN, Publish Date - May 20 , 2026 | 03:50 PM
సాధారణంగా సమ్మర్ అంటే సెలవులు, సినిమాలు.. థియేటర్స్ అంతా కళకళలాడుతూ ఉండాలి. కానీ, ఈ ఏడాది మాత్రం అంత కళ లేదు అని చెప్పొచ్చు. సమ్మర్ లో టాలీవుడ్ వెలవెలబోతోంది.
సాధారణంగా సమ్మర్ అంటే సెలవులు, సినిమాలు.. థియేటర్స్ అంతా కళకళలాడుతూ ఉండాలి. కానీ, ఈ ఏడాది మాత్రం అంత కళ లేదు అని చెప్పొచ్చు. సమ్మర్ లో టాలీవుడ్ వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) తమ కొత్త సినిమాల ట్రైలర్, గ్లింప్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తారని ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులు తెరదించుతూ.. మే 18 న పెద్ది (Peddi) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మే 19 అర్ధరాత్రి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా డ్రాగన్ (Dragon)గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ రెండింటిలో ప్రేక్షకుల మనసులను గెలించింది ఏది.. ? ఎన్టీఆర్, చరణ్ .. ప్రేక్షకులను మెప్పించారా.. ? అనేది చూద్దాం.
ఇక పెద్ది, డ్రాగన్ పోస్టులతో సోషల్ మీడియా కళకళలాడుతోంది అనుకుంటే.. రెండు కూడా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని అనుకున్నంత హైప్ ని సంపాదించుకోలేదు. పెద్ది ట్రైలర్, డ్రాగన్ గ్లింప్స్ అంత గొప్పగా లేవని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. పెద్ది విషయానికొస్తే.. స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ లో కథ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ, ఒకేసారి రెండు మూడు ఆటలు చూపించేసరికి ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారని అంటున్నారు. అంతేకాకుండా పెద్ది అంటే.. మొదటి నుంచి ఒక మంచి యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చిన బుచ్చి.. ట్రైలర్ లో యాక్షన్ ని మాత్రం చూపించలేదు. ఆట, ఆట, ఆట.. ట్రైలర్ మొత్తం ఇదే నిండిపోయింది. యాక్షన్ సీన్స్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ ఎక్కువ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఇంకోపక్క పెద్ది రిలీజ్ కి ఇంకా 14 రోజులు సమయం ఉంది. ఈలోపు ఆ మాస్ కంటెంట్ ని బుచ్చి రిలీజ్ చేసి హైప్ తీసుకొస్తాడేమో చూడాలి.
డ్రాగన్ విషయానికొస్తే.. పెద్ది కన్నా ఎక్కువే నిరుత్సాహపరిచాడని అంటున్నారు. దేవర తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం డ్రాగన్. మొదటి నుంచి ఈ టైటిల్ అనుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా దాన్నే కన్ఫర్మ్ చేశారు. అది కొంచెం పాజిటివ్ గా నిలిచింది. ఇక ప్రశాంత్ నీల్ అంటే.. డస్ట్, బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీ. డ్రాగన్ కూడా అలాగే చూపించాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే సగానికి సగం మందికి సలారే గుర్తొచ్చిందని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ లుక్, ఆ మ్యూజిక్, సేమ్ స్టోరీలానే అనిపిస్తోందని పెదవి విరుస్తున్నారు. సలార్ లో డ్రగ్స్.. ఇందులో హెరాయిన్ అదే కొద్దిగా మార్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ లుక్ కూడా కొంతమందికి నచ్చలేదని, సన్నగా ఉండడంతో చాలా కొత్తగా ఉన్నాడని అంటున్నారు. ఫస్ట్ గ్లింప్స్ చూసి అంచనా వేయలేరు కాబట్టి.. ఏడాది సమయంలో నీల్ ఇంకేదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
ఇక పెద్ది వర్సెస్ డ్రాగన్ విషయానికొస్తే.. రెండు వేరు వేరు కంటెంట్స్ కాబట్టి.. ఒకదానితో ఒకటి పోల్చడం కష్టమే. కానీ, ఈ రెండు సినిమాల కోసం చరణ్, ఎన్టీఆర్ ప్రాణం పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గెలుపు ఓటమి అని చెప్పలేం కానీ, ప్రేక్షకులను మాత్రం ఫుల్ గా గా సంతృప్తిపరచలేదని మాత్రం చెప్పొచ్చు. మరి ఇక్కడ కాకపోయినా థియేటర్ లో ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పేలబోతున్నాయో చూడాలి.