సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pooja Hegde: బుట్టబొమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి

ABN, Publish Date - Aug 01 , 2026 | 11:09 AM

బుట్టబొమ్మ, ఇప్పుడు సోషల్ మీడియాలో సడెన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈసారి ఆమె ట్రెండ్ అవుతోంది ఏ సినిమా ఆఫర్ వల్లో లేదా గ్లామరస్ పిక్స్ వల్లో కాదు... తన పెళ్లి వార్తలతో..!

టాలీవుడ్ ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ వరకు.. తన గ్లామర్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన ఈ బుట్టబొమ్మ, ఇప్పుడు సోషల్ మీడియాలో సడెన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈసారి ఆమె ట్రెండ్ అవుతోంది ఏ సినిమా ఆఫర్ వల్లో లేదా గ్లామరస్ పిక్స్ వల్లో కాదు... తన పెళ్లి వార్తలతో..! పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందంటూ నెట్టింట గుసగుసలు జోరందుకున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? పూజా ఓకే చెప్పిన ఆ వరుడు ఎవరు..?

ఒకప్పుడు టాలీవుడ్‌లో పూజా హెగ్డే ఉందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్లే అనే టాక్ ఉండేది. మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. కానీ, ఆ తర్వాతే పూజా కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి. దాంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అక్కడ కూడా సల్మాన్ ఖాన్‌తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, దేవా, హై జవానీ తో ఇష్క్‌ హోనా హై చిత్రాలు డిజాస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్‌లో అవకాశాలు నెమ్మదించాయి. ఒక దశలో టాలీవుడ్‌లో పూజా కెరీర్ క్లోజ్ అయినట్లే అని అంతా అనుకున్నారు. అయితే, ఆశలు వదులుకోని పూజా హెగ్డే మళ్ళీ తన కమ్‌బ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేసింది. ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కుతున్న శ్రీశ్రీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే హర్రర్ కామెడీ సిరీస్‌లలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన రాఘవ లారెన్స్ కాంచన 4 లోనూ పూజా హెగ్డే ఫిమేల్ లీడ్‌గా చేస్తోంది.

ఇలా ఒకవైపు మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి వరుస సినిమాలు చేస్తూనే... ఇంకోవైపు తన పర్సనల్ లైఫ్‌పై కూడా ఫోకస్ పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న లీక్స్ ప్రకారం... పూజా హెగ్డే సడెన్‌గా పెళ్లి బాట పట్టిందట. అయితే ఇది లవ్ మ్యారేజ్ కాదని, పూర్తిగా పేరెంట్స్ కుదిర్చిన పెళ్లే అని తెలుస్తోంది. ఇంట్లో వాళ్లు చూసిన వరుడికే పూజా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే... పూజా చేసుకోవడానికి ఒప్పుకున్న ఆ వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవాడా..? లేక ఏదైనా బడా బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యాపారవేత్తా..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికైతే ఈ పెళ్లి వార్తలపై పూజా హెగ్డే గానీ, ఆమె టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం రూమరా..? లేక త్వరలోనే పూజానే స్వయంగా గుడ్ న్యూస్ చెప్తుందా..? అనేది చూడాలి.

Updated Date - Aug 01 , 2026 | 11:27 AM