సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suman: భారత సెక్యూలరిజాన్ని కాపాడుకోవాలి

ABN, Publish Date - Oct 08 , 2026 | 10:52 AM

భారత సెక్యులరిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హీరో సుమన్ అన్నారు.

suman

తాను సెక్యులరిస్టునని, భారత సెక్యూలరిజాన్ని (Secularism) కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ సినీ హీరో సుమన్ (Hero Suman) అన్నారు. ఇటీవల జరిగిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడి ఆందోళన కలిగిస్తుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏయిర్ హోస్టేజ్‌కు విమానం నడపడంలో శిక్షణ ఇవ్వాలని కోరారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఓ ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుమన్ మాట్లాడారు. దేశ రక్షణలో సైనికులు ఎంతో త్యాగం చేస్తున్నారని, వారే రియల్ హీరోలని కొనియాడారు.

రైతులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న పంటలను పండించి దేశానికి ఆహారం అందిస్తున్నారని అన్నారు. డాక్టర్లు, నర్సులు ప్రాణాలను తెగించి రోగులకు వైద్య సేవలందిస్తున్నారని ఎమైనా తప్పులు జరిగితే వాటిని ఎత్తిచూపి నిజాలను ప్రజలకు ఎత్తిచూపిస్తుంది పాత్రికేయులేనని అన్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు పాదాభివందనం తెలిపారు. ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ (Martial Arts) శిక్షణ పొందాలని సూచించారు.

Updated Date - Oct 08 , 2026 | 11:08 AM