పెద్ది టైటిల్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా
ABN, Publish Date - May 18 , 2026 | 01:14 PM
పెద్ది.. పెద్ది.. పెద్ది.. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. గేమ్ ఛేంజర్ లాంటి పరాజయం తరువాత రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తోన్న చిత్రం పెద్ది (Peddi).
పెద్ది.. పెద్ది.. పెద్ది.. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. గేమ్ ఛేంజర్ లాంటి పరాజయం తరువాత రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తోన్న చిత్రం పెద్ది (Peddi). బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించగా కన్నడ స్టార్ హీరో శివన్న, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసాయి.
ఎన్నో వాయిదాల తరువాత పెద్ది జూన్ 4 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు.. పెద్ది టైటిల్ వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి ఈ చిత్రం కోడి రామ్మూర్తి బయోపిక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, ఈ కథను ఒక వ్యక్తి జీవితం నుంచి స్ఫూర్తి పొంది.. దానికి ఫిక్షన్ జోడించి తెరకెక్కించినట్లు తెలిపాడు.
' తూర్పు గోదావరి జిల్లాలో పెద్దిరాజు అన ఒక వ్యక్తి ఉండేవాడు. అతడికి క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడడం చాలా బాగా వచ్చు. డబ్బులు లేక అతను తాపీ పని చేసుకుంటూ.. ఖాళీ సమయంలో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళి ఆడేవాడు. అతని కథనే నేను రాసుకున్నాను. టైటిల్ విషయానికొస్తే ఏమి ఆలోచించకుండా పెద్దిరాజు లోని పెద్ది అనే పదాన్ని తీసి టైటిల్ గా పెట్టేశాం' అని చెప్పుకొచ్చాడు. అలా పెద్ది టైటిల్ పుట్టుకొచ్చిందని, ఈ కథ చాలా బావుంటుందని బుచ్చి చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.