Vishwanath and Sons: సూర్య- మమితా కెమిస్ట్రీ.. అదిరిపోయిందిగా
ABN, Publish Date - Jun 19 , 2026 | 07:59 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రేమలు ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons).
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రేమలు ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons). సార్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి నేనో బటర్‌ఫ్లై అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సాంగ్ ఆద్యంతం చాలా ఫ్రెష్ గా ఉంది. కరెంట్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించాడు. ఈ అందమైన మెలోడీ సాంగ్‌కి ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, యంగ్ సింగర్ సుభ్లాషిణి తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు.
ఒక అమ్మాయి మనసులోని ఫీలింగ్స్‌ని, ప్రణయ భావాలను బటర్‌ఫ్లై తో పోలుస్తూ సాగే ఈ పాట లూప్‌లో వినేలా ఉంది. లిరికల్ వీడియోలో సూర్య క్లాస్ లుక్స్, మమితా బైజు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉండబోతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా మమితా క్యూట్ స్టెప్స్ అదిరిపోయాయి. సాంగ్ మొత్తం అమ్మడి అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో నిండిపోయాయి. కచ్చితంగా ఈ సాంగ్ ని రీల్స్ బ్యాచ్ వదలరని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.