Vishwambhara: 'విశ్వంభర’ విడుదలపై సస్పెన్స్.. వశిష్ఠ పోస్ట్‌తో మళ్లీ మొదలైన చర్చ!
ABN, Publish Date - Sep 18 , 2026 | 02:41 PM
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీ గా ఉన్నారు. అందులో ఒకటి ఎప్పుడు మొదలైన ‘విశ్వంభర’, రెండోది ఇటీవల షూటింగ్ షురూ అయినా ‘కాకా’.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీ గా ఉన్నారు. అందులో ఒకటి ఎప్పుడు మొదలైన ‘విశ్వంభర’ (Vishwambhara) రెండోది ఇటీవల షూటింగ్ షురూ అయినా ‘కాకా’. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై కొద్దిరోజులుగా చర్చ మొదలైంది. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ‘కాకా’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తాజాగా ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'శ్వాస నాది, శాసనం నీది
ఆశ నాది, పాశం నీది,
ఆత్మ నాది, ఆట నీది…
ఎంత మాయగాడివయ్యా!
ఓం నమః శివాయ!!!
ఇందుకేనా నిన్ను “విశ్వంభరుడు” అని పిలిచేది?! సర్వం శివం.. ఓం నమః శివాయ !! అని శివుడికి సంబంధించిన ఓ ప్రవచనం వీడియో షేర్ చేశారు. సినిమా విడుదల సందిగ్ధంలో ఆయా ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.
విడుదలకు డబ్బు కావాలి...
అయితే ఈ సినిమా విడుదల వెనుక చాలా చిక్కుముడులున్నాయని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తై చాలా కాలమైన వీఎఫ్‌ఎక్స్ విషయంలో జాప్యం జరుగుతూ వచ్చిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సినిమా వాయిదా పడటానికి మరో కారణం వినిపిస్తోంది. సినిమా వీఎఫ్‌ఎక్స్ పూర్తి కావాలంటే బడ్జెట్ కావాలని, ప్రస్తుతం నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ నష్టాల్లో ఉండటం వల్ల సినిమా పనులు నిలిపేశారని టాక్ వినిపిస్తోంది. అందుకే దర్శకుడు కూడా సైలెంట్ అయి.. తన తదుపరి చిత్రం పనిలో పడినట్లు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం వశిష్ఠ నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసింది. ఇప్పుడాయన ‘విశ్వంభర’ పనులు పక్కనపెట్టి మోక్షజ్ఞ సినిమా కథకు సెకెండాఫ్ వర్క్ చేస్తున్నాడట. ‘విశ్శంభర’ విషయంలో చిరంజీవి కూడా పెద్ద హోప్‌తో లేరని మెల్లగా చూసుకోవచ్చులే అన్న ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ కావాలి అంటే బడ్జెట్ పరంగా చిరంజీవి ఓ అడుగుముందుకేస్తే తప్ప సినిమా విడుదల కాదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ పెట్టిన పోస్ట్ చర్చనీయాశంమైంది.
ALSO READ:
Missing Meghana Review: 'మిస్సింగ్ మేఘన' మూవీ ఎలా ఉందంటే
'పిఠాపురంలో అలా మొదలైంది' మూవీ రివ్యూ