సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: సంక్రాంతి బరిలో ‘విశ్వంభర’.. ‘కాకా’ రిలీజ్‌పై ఆసక్తికర చర్చ!

ABN, Publish Date - Sep 12 , 2026 | 02:42 PM

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ (Kaaka) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఆ దిశగానే దర్శకుడు శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌ కూడా పూర్తికానుందని టాక్‌ నడుస్తోంది. ఆ తదుపరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ చర్చ మొదలైంది. దానికి కారణం ‘విశ్వంభర’ సినిమా విడుదల తేది! ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. అంటే ‘విశ్వంభర’ సంక్రాంతి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ సంక్రాతి బరిలో విశ్వంభర ఉందనే వార్త మాత్రం జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ‘కాకా’ పరిస్థితి ఏంటి? అన్నది చర్చగా మారింది.

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘కాకా’ చిత్రం సంక్రాంతికి విడుదల అని ప్రకటించారు. ఒకవేళ ‘విశ్వంభర’ జనవరి 9న వస్తే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే చిరంజీవి నటించిన మరో సినిమా థియేటర్‌లోకి రావడం జరగదు. ఒక స్టార్‌ హీరోకి సంబంధించిన సినిమాలను పండగ సీజన్‌లో నాలుగు రోజుల వ్యవధిలో విడుదల చేయడం చాలా అరుదు. పైగా సంక్రాంతి అనగానే ఇతర హీరోల చిత్రాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక హీరోకి సంబంధించి రెండు చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు కూడా సాహసించరు. విశ్వంభర చిత్రం ఇప్పటికే పలుమారు వాయిదా పడింది. ఇంకా విజువల్‌ ఎఫెక్ట్స్‌, నిర్మాణనంతర కార్యక్రమాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అవన్ని ఓ కొలిక్కి వస్తేనే కానీ విడుదల తేదీ ఖరారు కాదు. పైగా ఈ చిత్రానికి ఓటీటీ గండం కూడా ఉంది.

ఓటీటీ గండం..

విశ్వంభర చిత్రానికి ఇ్కఆ ఓటీటీ డీల్‌ పూర్తి కాలేదు. చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జీ5 రూ. 35 కోట్లు వరకూ వెళ్లి వెనక్కి తిరిగింది. ఇప్పుడు సోనీ లివ్‌ లైన్‌లోకి వచ్చింది. ఇప్పుడే చర్చలు మొదలు పెట్టారు. ఒకవేళ సోనీలివ్‌ అంగీకరిస్తే.. నిబంధనల ప్రకారం, వాళ్లిచ్చిన డేట్‌కు 40 ప్లస్‌ డేస్‌ ముందు సినిమా థియేటర్‌లో విడుదల చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. మరి విశ్వంభర చిత్రం ఏ స్టెప్‌ తీసుకుంటుందో చూడాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కాకా’ను సంక్రాంతి బరిలో ఆపి, ‘విశ్వంభర’ను విడుదల చేయడానికే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Updated Date - Sep 12 , 2026 | 04:23 PM