విశ్వక్‌సేన్‌: రూట్‌ మారాలి.. డిమాండ్స్‌ తగ్గించాలి..

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:12 PM

విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం 'ఫంకీ’ గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా నెగటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం 'ఫంకీ’ గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె.వి. అనుదీప్‌ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా నెగటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విశ్వక్‌సేన్‌కు కొంతకాలంగా సరైన విజయం లేదు. అయినా ఆయన పారితోషికం విషయంలో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయని టాక్‌ నడుస్తోంది. దీంతో విశ్వక్‌సేన్‌ మరోసారి టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించగా విడుదలైన నాలుగు చిత్రాలకు ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో నిర్మాతలు చాలా నష్టపోయారు. అయినప్పటికీ విశ్వక్‌ సేన్ రూ. 7 కోట్ల వరకు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్‌. 

‘ఫంకీ’ సినిమా కథ పలువురు నిర్మాతలకు వినిపించినప్పటికీ విశ్వక్‌ పారితోషికం కారణంగా వారు వెనక్కి తగ్గారని తెలిసింది. చివరికి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. సినిమా ఫ్లాప్‌ కావడంతో నాగవంశీకి నష్టం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌ తీయడానికి డి.సురేశ్‌బాబు ముందుకొచ్చారు. కానీ విశ్వక్‌ రూ. 7 కోట్లు పారితోషికం అడగడంతో, ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న రిస్క్‌ దృష్ట్యా ఆయన పక్కకు జరిగాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను సృజన్‌ ఎర్రబోలు నిర్మిస్తున్నారు.

Vishwak.jpg

అయితే విశ్వక్‌సేన్‌ ప్రాఫిట్‌ షేరింగ్‌ మోడల్‌లో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఆయనకు దూరంగా ఉంటున్నాయని తెలుస్తోంది. రెండు పెద్ద బ్యానర్లు స్క్రిప్ట్ మీటింగ్స్‌ ఏర్పాటు చేసినప్పటికీ, పారితోషికం విషయంలో విభేదాల వల్ల అవి చేతులు మారాయట. ఈ సమయంలో విశ్వక్‌కు హిట్టు సినిమా అవసరం. ఇవన్నీ పక్కనపెట్టి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తే మంచి సినిమా అవకాశాలు వస్తాయని సన్నిహితులు హితవు పలుకుతున్నారని  తెలిసింది. హిట్టు పడితే ఆటోమేటిక్‌గా రెమ్యునరేషన్‌ అదే పెరుగుతోందని విశ్వక్‌ గ్రహించాలి.



‘కల్డ్‌’.. కీలకం..
విశ్వక్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కల్డ్‌’. హీరోగా, దర్శకుడి ఈ సినిమా ఆయనకు ఎంతో కీలకం. మార్క్‌, కిల్‌, హిట్‌ 3 తరహా వైలెన్స్‌ సినిమా ఇది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే అదే అర్థమవుతోంది. టీజర్‌ను కూడా ప్రేక్షకులను ముందుగానే ఆ వైలెన్స్‌కు ప్రిపేర్‌ చేసేలా  కట్‌ చేయబోతున్నారట.  

Updated Date - Feb 19 , 2026 | 04:02 PM