సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwak Sen: సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్న మాస్ కా దాస్

ABN, Publish Date - Apr 13 , 2026 | 04:41 PM

ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా, విశ్వక్‌సేన్‌ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు అతను సమర్పకుడి గానూ వ్యవహరిస్తున్నాడు.

Vishwak Sen New movie

గత కొన్నేళ్ళుగా వరుస పరాజయాలతో సహజీవనం చేస్తున్న విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గ్రేట్‌ కమ్ బ్యాక్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నాడు. కె.వి. అనుదీప్‌ (K.V. Anudeep) దర్శకత్వంలో చేసిన 'ఫంకీ' (Funky) సైతం పరాజయం పాలుకావడంతో ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్‌నూ మరింత పకడ్బందీగా ఎంపిక చేసుకుంటున్నాడు. విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న 'ఈ నగరానికేమైందీ?' సీక్వెల్‌ ఇప్పుడు సెట్స్ మీద ఉంది. దీనికి తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhaskar) దర్శకుడు. అలానే విశ్వక్ సేన్‌ స్వీయ దర్శకత్వంలో అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్ మూవీగా 'కల్ట్‌' (Cult) ను నిర్మిస్తున్నాడు. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ కాకరాల మరో నిర్మాత.


ఇదిలా ఉంటే... తాజాగా విశ్వక్‌ సేన్‌ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. సుధాకర్‌ మిక్కిలినేని విశ్వక్‌ సేన్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ దర్శకుడు రజక్‌ ఈ మూవీకి డైరెక్టర్‌. విశేషం ఏమంటే విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాలో నటించడమే కాకుండా... సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు. ఈ న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ ఎంటర్ టైనర్‌కు తేజస్‌ కృష్ణ స్వరాలు సమకూర్చుతుండగా, అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీనికి భాను భోగవరపు, నందు సవిరగాన సంభాషణలు అందిస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాలు విశ్వక్‌సేన్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Updated Date - Apr 13 , 2026 | 04:41 PM