సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డబ్బు కోసం ఇంతగా దిగజారాలా.. విష్ణుప్రియ

ABN, Publish Date - Nov 09 , 2026 | 02:43 PM

టీవీ షోలు, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర బ్యూటీ విష్ణుప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

Vishnupriya Bhimeneni

టీవీ షోలు, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర బ్యూటీ విష్ణుప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. పటాస్, సుడిగాలి సుధీర్‌తో పోరా పోవే వంటి షోలతో పాపులారిటీ సంపాదించి, బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ భామ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా డబ్బు ఆర్జించే క్రమంలో హద్దులు దాటుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో అందాల ఆరబోతకు తెరతీసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.


ఇటీవల కాలంలో మోస్ట్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న నటిగా నిలిచిన విష్ణుప్రియ, సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న బోల్డ్ పిక్స్, వీడియోలు ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో తన బాడీ కౌంట్ 5 అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ చిన్నది, ఆమెపై నమోదైన పోలీసు కేసులను కూడా లెక్కచేయకుండా కంటెంట్ పరిధిని మరింత పెంచుతుండటం గమనార్హం. కేసులు నమోదైన కొద్దీ ఆమెకు సబ్‌స్క్రైబర్స్ సంఖ్య అమాంతం పెరగడం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


తాజాగా తన సబ్‌స్క్రైబర్ల కోసం, సంపాదన కోసం విష్ణుప్రియ బికినీలో చేసిన బోల్డ్ వీడియోను పంచుకోవడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ విజువల్స్‌లో ఆమె గ్లామర్ హద్దులు చెరిపేసి ఎక్స్‌పోజింగ్ చేయడంతో కుర్రకారు ఫ్యూజులు ఎగిరిపోతుండగా, మరోవైపు ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. కేవలం సబ్‌స్క్రిప్షన్లు, డబ్బు కోసమే ఈ రేంజ్‌లో అందాలను ఎరగా వేస్తూ విష్ణుప్రియ దిగజారుతోందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


డబ్బు సంపాదించడం తప్పుకాదు, కానీ దాని కోసం సంస్కృతి, విలువలను మరిచి మరీ ఇంతగా దిగజారాలా? అని నెటిజన్లు ఆమెకు హితబోధ చేస్తున్నారు. ఇలాంటి బోల్డ్ కంటెంట్‌ చేస్తే మున్ముందు ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, విష్ణుప్రియ మాత్రం ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా తన సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌ను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ భామ ఎలాంటి విపరీతమైన కంటెంట్‌తో ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Updated Date - Nov 09 , 2026 | 02:58 PM