సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishal: నటుడిగానే కాదు.. దర్శకుడినూ మెప్పిస్తాను..

ABN, Publish Date - Jun 29 , 2026 | 03:04 PM

విశాల్‌ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మకుటం’. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై స్వర్గీయ ఆర్‌ బీ చౌదరి నిర్మించిన సినిమా ఇది.

Vihal Makutam Movie

విశాల్‌ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మకుటం’. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై స్వర్గీయ ఆర్‌ బీ చౌదరి నిర్మించిన సినిమా ఇది. అంజలి, దుషారా విజయన్‌ నాయికలు. ఆదివారం ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘నచ్చాకే వచ్చేరా’ పాటను విడుదల చేశారు.

విశాల్‌ మాట్లాడుతూ ‘హీరోగానే కాకుండా ఈసారి దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్‌ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. దివంగత ఆర్‌.బి.చౌదరిగారు తన బ్యానర్‌లో 99వ చిత్ర బాధ్యతలు నాకు అప్పగించారు. అవుట్‌పుట్‌తో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. ఈ బ్యానర్‌ ద్వారా వచ్చిన దర్శకుల్లో నేను 45వ వాడిని. ఈ సినిమా కోసం ఏడాదిపాటు వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాను. ఈ జర్నీలో ధన్సిక అండగా నిలిచింది. ‘పందెంకోడి’ సినిమాను నాన్న పట్టుబట్టి తెలుగులో విడుదల చేశారు. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదిరిస్తూనే ఉన్నారు. 'మకుటం' మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తుంది’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ ‘మదగజరాజా’ తరువాత విశాల్‌తో చేసిన సినిమా ఇది. అప్పుడు విశాల్‌ హీరో.. ఇప్పుడు దర్శకుడు కూడా. ఇందులో నేను ఓ మంచి, పవర్‌ ఫుల్‌ రోల్‌ చేశా. మా ఇద్దరికీ 15 ఏళ్ల అనుబంధం ఉంది. ‘మకుటం’తో దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ ఎప్పుడూ బాగుంటుంది. ఇందులో ‘నచ్చాకే వచ్చేరా’ పాట నాకెంతో ఇష్టం’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!

పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌.. ఇక పట్టుకోలేరేమో

Updated Date - Jun 29 , 2026 | 05:01 PM