సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విరోష్ వెడ్డింగ్: సంప్రదాయం ప్రకారం విందు.. అతిథులకు అతిథ్యం

ABN, Publish Date - Feb 26 , 2026 | 03:34 PM

విజయ్‌ దేవరకొండ (VD), రష్మిక (Rashmika) గురువారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనగానే జనాలు బాగా గుర్తు పెట్టుకునేది విందు. విరోష్‌ దంపతులు వివాహ వేడుకకు వచ్చిన  అతిథుల కోసం పసందైన వంటకాలను ప్లాన్‌ చేశారట.

Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ (VD), రష్మిక (Rashmika) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి తక్కువ మంది అతిథులతో ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం జరిగింది. పెళ్లి అనగానే జనాలు బాగా గుర్తు పెట్టుకునేది విందు. విరోష్‌ దంపతులు వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం పసందైన వంటకాలను ప్లాన్‌ చేశారు. పెళ్లి భోజనంలో సంప్రదాయ వంటకాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిన రుచులను కూడా అతిథులకు వడ్డించనున్నారు. రాయల్‌ వెడ్డింగ్‌లో తెలంగాణ స్టైల్‌ మటన్‌ బిర్యానీ, చికెన్‌ స్పెషల్స్‌ తో పాటు కర్ణాటక స్పెషల్‌ బిసిబేళా బాత్‌, కూర్గ్‌ స్పెషల్‌ వంటకాలతో పాటు కొడువ సంప్రదాయ వంటకాలను చేయించారు. ఇక మరోవైపు టాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం అరటి ఆకుపై సంప్రదాయ వంటకాలను సైతం రెడీ చేశారు. (Virosh wedding)

తెలంగాణ, ఆంధ్రా సంప్రదాయ వంటలు (Food Menu) అయిన నాటుకోడి పులుసు, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, గారెలు, పప్పు, పచ్చి పులుసు, కీమా సమోసాలు కూడా మెనూలో ఉన్నాయి. డెసర్ట్స్‌ అయితే ఇంకా స్పెషల్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. రష్మికకు ఇష్టమైన రుచులను మెనూలో ఉండేలా చూసుకున్నారట విజయ్‌ దేవరకొండ. రష్మిక డెజర్ట్స్‌ అంటే ప్రాణం. దీంతో ఆమెకు ఇష్టమైన  పదార్థాలను మెనూలో ఉండేలా ప్లాన్‌ చేశారట. గురువారం ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.  సాయంత్రం 4:30 గంటలకు కొడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వీరి పెళ్లి జరగనుంది. 

Updated Date - Feb 26 , 2026 | 05:00 PM