సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విరోష్‌ వెడ్డింగ్ : విరోష్‌ సంగీత్‌.. హైలైట్స్‌ ఇవే..

ABN, Publish Date - Feb 26 , 2026 | 08:54 AM

‘విరోష్‌ వెడ్డింగ్‌’ (Virosh Wedding) ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ (VD), రష్మిక మందన్న (Rashmika) పెళ్లి సందడి షురూ అయింది.

‘విరోష్‌ వెడ్డింగ్‌’ (Virosh Wedding) ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ (VD), రష్మిక మందన్న (Rashmika) పెళ్లి సందడి షురూ అయింది. ఉదయ్‌పూర్‌లో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. గురువారం ఉదయం 10:10 గంటలకు వీరిద్దరూ వివాహబంధంతో ఒకటి కానున్నారు. అయితే పెళ్లికి ముందు సంగీత్‌ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంబరంగా జరిగింది. వీరిద్దరి జర్నీకి సంబంధించిన ఫ్రేమ్స్‌ను వేదిక దగ్గర ఉంచారు. విజయ్‌ దేవరకొండ చేతిలో చెయ్యేసి రష్మిక సంగీత్‌ వేదిక దగ్గరకు చేరుకున్నారు. ఈ జంట వ్యక్తిగత ప్లే లిస్ట్‌తో పాటు ఇద్దరి ఫిల్మ్‌ జర్నీని గుర్తు చేసేలా పాటలను ప్లే చేశారు.


వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘గీత గోవిందం’తో బెస్ట్‌ పెయిర్‌ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పాటలతోనే సంగీత్‌ షురూ చేశారు. ‘తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా’, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’, ‘కల్యాణి వచ్చా... వచ్చా.. ’ వంటి పాటలు ఆహుతుల్లో మంచి జోష్‌ నింపాయి. దీంతో పెళ్లి వేడుకలో భాగమైన వారంతా సంబరాల్లో మునిగిపోయారు. అలాగే, పుష్ప 2లోని పాటలకు అతిథులంతా ఒకసారిగా డాన్స్‌ ఫ్లోర్‌ మీదకు వచ్చి డ్యాన్స్‌ చేయడంతో సంగీత్‌ ఈవెంట్‌కు హై ఎనర్జీ ఇచ్చింది. సంగీత్‌లో విజయ్‌, రష్మిక కూడా డాన్స్‌ చేశారు. రష్మిక, విజయ్‌ పేరెంట్స్‌ కూడా పాటలకు పెర్‌ఫార్మ్‌ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Feb 26 , 2026 | 11:16 AM