విరోష్: దేశవ్యాప్తంగా అన్నదానం, స్వీట్స్ పంపిణీ
ABN, Publish Date - Mar 01 , 2026 | 01:59 PM
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విరోష్ జంటకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కొన్నేళ్ల ప్రేమ తర్వాత ఈ నెల 26న వివాహ బంధంతిజో ఒకటయ్యారు. రాజస్థాన్, ఉదయపూర్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు నూతన జంట. వారిపై తమ ప్రేమను చూపించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేస్తున్నట్లు విరోష్ ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
విరోష్ స్పందిస్తూ 'మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి' ప్రకటనలో పేర్కొన్నారు.