సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వయ్‌లెంట్‌ పిల్లా..! రష్మిక పోస్టర్‌పై విజయ్‌ దేవరకొండ కామెంట్ వైర‌ల్‌

ABN, Publish Date - Sep 02 , 2026 | 07:39 AM

ర‌ష్మిక సినిమా మైసా పోస్ట‌ర్ గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

vijay devarakoda

‘వయ్‌లెంట్‌ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌’ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ విడుదల చేసింది. పోస్టర్‌లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్‌ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్టర్‌ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్‌లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది.

Updated Date - Sep 02 , 2026 | 09:02 AM