Tollywood: రంజుగా వినాయకచవితి వార్!

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:26 PM

ఈ యేడాది వినాయక చవితికి విజయ్ దేవరకొండ, కార్తీ, ఫహద్ ఫాజిల్‌ నటించిన 'రణబాలి', 'సర్దార్ 2', 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నాయి.

Vinayaka Chavithi Movies

ఈ యేడాది వినాయక చవితి పండగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో రంజైన పోటీ నెలకొంది. మూడు భాషలకు చెందిన యంగ్ స్టార్ హీరోస్ మూవీస్ ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ వివాహానంతరం వస్తున్న తొలి చిత్రంగా 'రణబాలి'పై స్పెషల్ క్రేజ్ నెలకొని ఉంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు టీ సీరిస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగే కాలానికి సంబంధించిన చారిత్రక చిత్రమిది. దీనికి అజయ్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం వచ్చిన తమిళ అనువాద చిత్రం 'సర్దార్' కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టంది. అందులో కార్తీ తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించాడు. దాంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'సర్దార్ 2' మూవీని తెరకెక్కిస్తున్నారు. పి.యస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రను పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చుతున్నాడు. 'సర్దార్ 2' సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.


అలానే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు 'పుష్ప' సీరిస్ లో పవర్ ఫుల్ విలన్ గా నటించిన ఫహద్ తొలిసారి తెలుగులో 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మ్యాజికల్ మూవీ సెప్టెంబర్ 11న విడుదల కాబోతోంది. దీనిని ఆర్కా మీడియాకు చెందిన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యేడాది వినాయక చవితికి ఇలా మూడు భాషలకు చెందిన ముగ్గురు యంగ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, కార్తీ, ఫహద్ ఫాజిల్‌ చిత్రాలు తెలుగులో వస్తున్నాయి.

గత యేడాది దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొంది. ఆ సమయంలో 'సుందరకాండ, కన్యాకుమారి, త్రిభాణధారి బార్బరిక్, బ్రహ్మండ, అర్జున్ చక్రవర్తి, అగ్రహారంలో అంబేద్కర్' సినిమాలు విడుదలయ్యాయి. అయితే అదే సమయంలో వచ్చిన మలయాళ అనువాద చిత్రం 'కొత్త లోక' అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏదేమైనా గత యేడాది వినాయక చవితితో పోల్చితే, ఈ సారి పండగ సీజన్ రంజుగా ఉండబోతోంది.

ఇవి కూడా చదవండి:

మహేశ్‌ బాబాయ్‌ మెచ్చుకున్నారు! ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వ‌స్తారు

నితిన్‌తో.. నాని సినిమా! ఈ సారైనా.. హిట్టు ప‌డేనా?

విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..

Updated Date - Jul 13 , 2026 | 02:12 PM