సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గబ్బర్ సింగ్ విలన్ కూతురిని చూశారా.. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదు

ABN, Publish Date - Oct 12 , 2026 | 04:47 PM

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో భయంకరమైన విలన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh).

Abhimanyu Singh

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో భయంకరమైన విలన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh). 'రక్తచరిత్ర' సినిమాలో బుక్కారెడ్డిగా ఆయన చూపించిన విలనిజం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఆ తర్వాత పవార్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రజినీకాంత్ అన్నాత్తే, నందమూరి బాలకృష్ణ జై సింహాతో పాటు పలు సూపర్‌హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా అలరించాడు. తెరపై అంత భయంకరంగా కనిపించే అభిమన్యు సింగ్, నిజ జీవితంలో మాత్రం ఎంతో ఆప్యాయత కలిగిన తండ్రి అని చెప్పొచ్చు.


తాజాగా ఆయన తన కుమార్తె అమెలీ సింగ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని పిక్స్ పంచుకున్నాడు. తన కూతురిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ 'హ్యాపీ బర్త్‌డే బేటా.. నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌లో కనిపిస్తున్న అమెలీ సింగ్ ఫోటోలు చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.


స్క్రీన్‌పై అభిమన్యు సింగ్ రఫ్‌గా, కరడుగట్టిన విలన్‌గా కనిపిస్తే, ఆయన కుమార్తె అమెలీ మాత్రం హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతోంది. క్యూట్ చిరునవ్వు, ఆకర్షణీయమైన రూపంతో ఉన్న అమెలీ ఫోటోలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'విలన్ కూతురు హీరోయిన్ లాగా ఉంది', 'త్వరలోనే ఈమె టాలీవుడ్‌లో లేదా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం'అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్లామర్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీలు కామన్ అయిన నేపథ్యంలో, అమెలీ సింగ్ కూడా త్వరలోనే వెండితెరకు పరిచయమవుతుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి విలన్‌గా రాణిస్తే, కూతురు హీరోయిన్‌గా అలరిస్తుందేమో చూడాలి.

Updated Date - Oct 12 , 2026 | 04:47 PM