విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించిన 'ఆలోచన' టీజర్
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:18 PM
సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించిన 'ఆలోచన' చిత్రం టీజర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.
ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం 'ఆలోచన'. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి, దర్శకత్వం చేశారు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మురళీ మోహన్ విడుదల చేశారు. తాజాగా 'ఆలోచన' టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ' 'ఆలోచన' టీజర్ బాగుంది. ఫ్రేమింగ్, మ్యూజిక్ , పెర్ఫార్మెన్స్, మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. వాస్తవ సంఘటనలను తీసుకొని చేసిన ఈ సినిమా అద్భుతమైన నటుల కాంబినేషన్‌లో, స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో చేశారు. మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు' అని ప్రశంసించారు. మచి కథాబలం ఉన్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, అతి త్వరలోనే సాంగ్, ట్రైలర్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్.
ఇవి కూడా చదవండి:
విద్యార్థుల ఆందోళన.. సీఎం విజయ్‌కు కనిపించడం లేదా?: దర్శకులు
బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?