సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓ సుంద‌రి.. లిరిక‌ల్ వీడియో సాంగ్‌! జేసుదాస్‌ను.. మ‌రిపించాడుగా

ABN, Publish Date - Apr 16 , 2026 | 07:41 AM

కాస్త విరామం త‌ర్వాత స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తోన్న విభిన్న క‌థా చిత్రం రావు బ‌హ‌దూర్.

Rao Bahadur

కాస్త విరామం త‌ర్వాత స‌త్య‌దేవ్ (Satya Dev) హీరోగా న‌టిస్తోన్న విభిన్న క‌థా చిత్రం రావు బ‌హ‌దూర్ (Rao Bahadur). వికాస్‌, దీపా థామ‌స్ (Deepa Thomas), బాలా ప‌రాష‌ర్‌, ఆనంద భార‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం వెంక‌టేశ్ మ‌హా (Venkatesh Maha) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు. క‌, చిదంబ‌రం చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ చ‌క్రాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ( Sri Chakraas Entertainments), మ‌హాయాన మోష‌న్ పిక్చ‌ర్స్ (Mahayana Motion Pictures), A+S మూవీస్ (A+S Movies) సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు GMB ఎంట‌ర్‌టైన్మెంట్ (GMB Entertainment) సినిమాను స‌మ‌ర్పిస్తుండ‌డం విశేషం.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై మంచి హైప్స్ తీసుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా బుధ‌వారం సాయంత్రం ఈ సినిమా నుంచి ఓ సుంద‌రి (O Sundari Lyrical Video) అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు రెహ‌మాన్ (Rehman) సాహిత్యం అందించ‌గా స్మ‌ర‌ణ్ సాయి (Smaran Sai) సంగీతంలో విజ‌య్ యేసుదాస్ (Vijay Yesudas) ఆల‌పించారు.

ఇక పాట విష‌యానికి వ‌స్తే ఐదు నిమిషాల 10 సెకండ్ల పాటు సుదీర్ఘంగా ఉన్న ఈ గీతం సాహిత్యం అంత‌కుమించిన తండ్రి యేసుదాస్‌నే త‌ల‌పిస్తూ సాగిన విజ‌య్ గాత్రం ఆద్యంతం అద్భుతంగా ఉన్నాయి. పాట చిత్రీక‌ర‌ణ సైతం క‌నుల‌కింపుగా ఉంది. అతి స్వ‌ల్ప స‌మ‌యంలోనే ఈ పాట చార్ట్‌బ‌స్ట‌ర్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచే అవ‌కాశం మెండుగా ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఇప్పుడే ఈ పాట విని ఆస్వాదించండి మ‌రి.

Updated Date - Apr 16 , 2026 | 07:50 AM