రణబాలి.. ఏందయ్యా సామీ వీడియో.. ఎంత ముద్దుగా ఉన్నార్రా విరోష్

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:06 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా టాలెంట్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణబాలి (Ranabaali).

Ranabaali

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా టాలెంట్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణబాలి (Ranabaali). ఈ సినిమాపై మొదటి నుంచి ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. విరోష్ జంట పెళ్లి తరువాత నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆ అంచనాలతోనే అక్టోబర్ 16 న రణబాలి రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథ పరంగా బాగానే ఉన్నా కూడా విజయ్ ఎక్స్ ప్రెషన్స్, రాహుల్ టేకింగ్ అంతగా బాలేదని పెదవి విరిచారు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డు కలక్షన్స్ రాబట్టింది.


రణబాలి ప్రస్తుతం థియేటర్ లో రన్ అవుతున్న ఈ సినిమాపై మరింత హైప్ పెంచడానికి మేకర్స్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకే హైలైట్ గా మారిన ఏందయ్యా సామీ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ - రష్మిక పెళ్లి సమయంలో ఈ సాంగ్ ని స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి వారిద్దరికీ బెస్ట్ విషెస్ తెలిపారు చిత్ర బృందం. అప్పటి నుంచే ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక సినిమాలో కూడా లెంత్ ఎక్కువ ఉండడంతో మొదటి చరణం వరకే చూపించారు.


తాజాగా వీడియో సాంగ్ లో పూర్తి సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రీ అద్బుతమైన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. అజయ్ గొడవలే, శ్వేతా మోహన్ వాయిస్ మరో ఎత్తు అని చెప్పాలి. ఈ సాంగ్, మ్యూజిక్, వాయిస్ తో ప్రేక్షకులు ప్రేమలో పడిపోయారు. మొరటు మొగుడిని ప్రేమగా మార్చుకున్న భార్యగా రష్మిక ఎక్స్ ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ చూసిన ఫ్యాన్స్.. అబ్బా విరోష్ జంట ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుందని టాక్. మరి థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 26 , 2026 | 05:10 PM