నాగార్జున చెప్పినట్టే చేసిన విజయ్ దేవరకొండ
ABN, Publish Date - Oct 10 , 2026 | 09:56 PM
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణబాలి' (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ కానుంది
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణబాలి' (Ranabaali). రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటిక్ ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. రణబాలి కోసం విజయ్ అనుసరిస్తున్న ప్రణాళికలు చూస్తుంటే లెనిన్ సమయంలో అక్కినేని నాగార్జున చెప్పిన కొన్ని విలువైన సలహాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు అనిపిస్తుంది.
లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.. హడావిడిగా సినిమాలను రిలీజ్ చేసుకోవడం కన్నా.. విడుదలకు ముందే ఫస్ట్ కాపీ రెడీ చేసుకొని, చూసుకొని.. అందులో లోపాలు ఉంటే సరిచేసుకుంటే.. రిలీజ్ సమయంలో టెన్షన్ ఉండదని, క్వాలిటీ సినిమాని ప్రేక్షకులకు అందించవచ్చని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో ఇది అసాధ్యమైన పని అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ, విజయ్ దేవరకొండ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
'రణబాలి సినిమా ప్రమోషన్స్ లో విజయ్ మాట్లాడుతూ..'పెళ్లి చూపులు తర్వాత నేను కంఫర్ట్ గా ప్రమోషన్ చేస్తూ, రెండు మూడు సార్లు కాపీ చెక్ చేసుకుని, రిలీజ్ కు తీసుకొస్తున్న సినిమా ఇది. మా మూవీ బ్యాక్ డ్రాప్ లోనే చాలా సీజీ వర్క్ ఉంది. ప్రీ ప్రొడక్షన్ టైమ్ లోనే మాకు సీజీ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. ఫిబ్రవరి టైమ్ లోనే సీజీ సీన్స్ అన్నీ ఇచ్చేశాం. సెన్సార్ సర్టిఫికెట్ సోమవారం వస్తుందని అనుకుంటున్నాం. సర్టిఫికెట్ ఏది ఇచ్చినా ఫర్వాలేదు' అని అని చెప్పుకొచ్చాడు.
సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, మేకింగ్ పరంగా ఎలాంటి లోపాలు రాకుండా ఉండేందుకు విజయ్.. నాగార్జున చెప్పిన సలహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇలానే అందరూ ప్రయత్నిస్తే ఎవరికీ రిలీజ్ టెన్షన్స్ ఉండవని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల టికెట్ ధరల పెంపుపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ విజయ్ డేరింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.మంచి అవుట్ పుట్, నార్మల్ టికెట్ రేట్స్ తో విజయ్ సిద్ధమయ్యాడు. మరి ఈసారి రణబాలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.