సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఉదయపూర్‌లో మోగిన.. విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి బాజా

ABN, Publish Date - Feb 25 , 2026 | 06:24 AM

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మంద‌న్న మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒకటవనున్నారు.

Vijay Deverakonda, Rashmika

హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరోయిన్‌ రష్మిక మంద‌న్న (Rashmika Mandanna) మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒకటవనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్‌ లగ్జరీ హోటల్‌ ఈ నెల 26న జరిగే వీరి వివాహానికి వేదికవుతోంది. ఇప్పటికే అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, మిత్రులతో కలసి విజయ్‌, రష్మిక ఉదయపూర్‌ చేరుకున్నారు.

మంగళవారం మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలను నిర్వహించి, బుధవారం హల్దీ, గురువారం వివాహం తెలుగు, క‌న్న‌డ సాంప్ర‌దాయాల్లో రెండు మార్లు జరపడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు విజయ్‌, రష్మిక. ఐటీసీ మెమొంటోస్‌ హోటల్‌లో మొత్తం 117 విల్లాలు ఉన్నాయి. ఓ నది, ఆ పక్కనే ఓ సరస్సు.. వాటి పక్కనే ఈ విల్లాలు ఉండడం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు, కొంతమంది దర్శకులు విజయ్‌, రష్మిక వివాహానికి హాజరవుతారని అంటున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 08:07 AM