సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీఎం విజయ్ ని కలిసిన రౌడీ విజయ్..

ABN, Publish Date - Oct 12 , 2026 | 09:38 PM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న దంపతులు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Vijay

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న దంపతులు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) ని మర్యాదపూర్వకంగా కలిశారు. రణబాలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్ళిన ఈ జంట.. సీఎం విజయ్ ని కలిశారు. విజయ్ సైతం.. కొత్త దంపతులను ఆప్యాయంగా ఆహ్వానించి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ అరుదైన భేటీకి సంబంధించిన అనుభవాలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


'ఎంతో బిజీ షెడ్యూల్, సుదీర్ఘమైన పనిదినం తర్వాత కూడా ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. విజయ్ గారితో ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాను. జీవితం, పని అలాగే ప్రపంచం గురించిన తన అమూల్యమైన వ్యక్తిగత అభిప్రాయాలను మాతో పంచుకున్నారు. కేవలం ఒక్కసారే కల్సినా సరే, ఆయన నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిపోయారు. మళ్లీ కలుద్దాం సర్' అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక రష్మిక కూడా విజయ్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది. 'చాలా కాలం తర్వాత దళపతి విజయ్ గారిని కలిసే అవకాశం దొరికింది. ఆయనను ఆరాధించడం మొదలుపెట్టిన రోజు నుంచి, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, నేడు ఆయనను ఒక ముఖ్యమంత్రిగా గౌరవించే స్థాయికి ఎదగడం వరకు ప్రతీదీ అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం' అంటూ తెలిపింది.


ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, టాలీవుడ్ - కోలీవుడ్ స్టార్ హీరోల కలయికపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నోటా సినిమాలో రౌడీ సీఎంగా నటించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని మ్యూచువల్ ఫ్యాన్స్ సీఎం విజయ్ ని కలిసిన రౌడీ విజయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రణబాలి అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ - రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Oct 12 , 2026 | 09:38 PM