Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా..
ABN, Publish Date - Sep 09 , 2026 | 04:33 PM
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం రణబాలి. టాక్సీవాలా వంటి విజయవంతమైన చిత్రంతర్వాత విజయ్ దేవరకొండ- రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం రణబాలి (Ranabaali). టాక్సీవాలా వంటి విజయవంతమైన చిత్రంతర్వాత విజయ్ దేవరకొండ- రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 16న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లే విలన్ గా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నూకణహి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రణబాలి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 1876-1878 కాలంలో భారతదేశాన్ని కుదిపేసిన దారుణమైన కరువు, బ్రిటిష్ పాలన నేపథ్యంలో రణబాలి తెరకెక్కినట్లు టీజర్ ని చూస్తుంటే అర్ధమవుతోంది. ఇది అన్నపూర్ణ దేశంరా.. అన్నానికి కరువేంది అనే డైలాగ్.. ఆ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అన్నపూర్ణ లాంటి భూమిపై ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, బ్రిటిష్ వారి అణచివేతకు, అన్యాయాలకు వ్యతిరేకంగా తన ప్రజలను కాపాడుకోవడానికి.. తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే ఒక తెగింపు ఉన్న యోధుడి ప్రయాణాన్ని టీజర్‌లో ఆవిష్కరించారు. సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ నట విశ్వరూపం చూపించాడు. రణబాలి భార్యగా రష్మిక కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసింది.
టీజర్ అంతా ఒక ఎత్తు అయితే.. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ పీరియాడిక్ వాతావరణాన్ని చాలా ప్రభావవంతంగా ఆవిష్కరించాయి. విజయ్ దేవరకొండ రఫ్ అండ్ మాస్ లుక్‌తో పాటు ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా అనే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ఈసారి విజయ్ కచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి విజయ్ కి రణబాలి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.