Koffee with Karan: విరోష్ స్పెషల్.. నిజాలు బయటపడ్డాయి
ABN, Publish Date - Oct 18 , 2026 | 02:23 PM
తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 9 కి విజయ్ దేవరకొండ, రష్మిక జంట వెళ్తున్నారు అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి వీరి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee with Karan) సీజన్ 9 కి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika)జంట వెళ్తున్నారు అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి వీరి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్ లో విరోష్ జంట రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే కరణ్.. ఈసారి కూడా ఘాటు ప్రశ్నలతో పిచ్చెక్కించాడు.
షోలో భాగంగా వారిద్దరి రిలేషన్షిప్, మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన కరణ్.. స్టన్నింగ్ పర్సన్ లైఫ్లోకి వచ్చాడు.. ముందు పెళ్లి గురించి ప్రపోజల్ ఏమైనా జరిగిందా అని అడగ్గా.. విజయ్ అసలు నిజం బయటపెట్టాడు. రష్మికనే ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిందని, ఒకసారి కాదు వందసార్లు.. ఏడాది మొత్తం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రష్మిక కాకుండా ఏ హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంటుందని అనుకుంటున్నారు అంటే.. రష్మిక నోబడీ అని చెప్పగా విజయ్ కూడా అందరి భర్తల్లానే భార్య మాట వినాలి.. అదే మొదటి రూల్ అని చెప్పి నవ్వులు పూయించాడు.
ఇక సెలబ్రిటీలకు కాల్ చేయమన్నప్పుడు విజయ్.. అల్లు అర్జున్ కి కాల్ చేయడం హైలైట్ గా మారింది. కరణ్ షో అంటే మసాలా లేకుండా ఎందుకు ఉంటుంది. చివర్లో హోర్నిమన్ సర్కిల్లో ఎవరు ఉంటారు? అని అడగ్గా రష్మిక హోర్నిమన్ సర్కిల్ అంటే ఏంటి అని అడిగింది. దానికి విజయ్ హోర్నీ పీపుల్ అని అనగానే వెంటనే రష్మిక జోక్ చేస్తున్నావా అని నవ్వేసింది. ఇక ఈ షోలో ఎప్పట్లాగే కరణ్ జోహార్ అడిగే రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, సరదా గేమ్స్, సెలబ్రిటీలకు ఫోన్ కాల్స్ చేసే సెగ్మెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్నాయి. అల్లు అర్జున్, రణ్బీర్ కపూర్ వంటి స్టార్ హీరోల గురించి విజయ్ మాట్లాడిన మాటలు, అలాగే కరణ్ జోహార్ వేసిన ఫన్నీ ప్రశ్నలకు ఇద్దరూ ఇచ్చిన సమాధానాలు ఈ ఎపిసోడ్పై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అక్టోబర్ 21న జియోహాట్స్టార్ లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షోలో విరోష్ ఇంకెన్ని నిజాలు బయటపెట్టారో చూడాలి.