సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జపాన్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్!

ABN, Publish Date - Nov 08 , 2026 | 10:34 PM

ఈసారి విజయ్ దేవరకొండ కుటుంబం దీపావళి వేడుకలు జపాన్‌లో జరిగాయి. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి హోమం నిర్వహించి పండుగ జరుపుకున్నారు.

Vijay Deverakonda Rashmika Mandanna

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) దంప‌తులు ఈసారి దీపావళి పండుగను (Diwali Celebrations) తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో జరుపుకున్నారు.

ఎక్కడ ఉన్నా మన సంప్రదాయాలను మర్చిపోకూడదన్నట్టుగా విదేశాల్లోనూ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జపాన్ (Japan) లోనే కుటుంబ సభ్యులతో కలిసి హోమం నిర్వహించి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటితో పాటు అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "దీపావళి శుభాకాంక్షలు.. మా దేవరకొండ కుటుంబం తరఫున మీ అందరికీ ప్రేమాభిమానాలు, హ‌గ్స్‌" అంటూ తన సందేశాన్ని పంచుకున్నారు.

విదేశాల్లో ఉన్నా కుటుంబంతో కలిసి మన పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సంబురాల్లో ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda) సైతం పాలు పంచుకున్నాడు. విజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Nov 08 , 2026 | 10:34 PM