'రణబాలి' షూటింగ్ పూర్తి.. డైరెక్టర్ పోస్ట్ వైరల్

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:09 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.

Ranabaali

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి (Ranabaali) . తాజాగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. రణబాలి షూటింగ్ మొత్తం పూర్తైందని వెల్లడించారు.

'అలుపెరగని, ఉత్సాహభరితమైన నా ఆర్మీతో గడిపిన 130 రోజుల షూటింగ్ షెడ్యూల్‌కు ఇక్కడితో తెరపడింది' అని రాహుల్ ట్వీట్ చేశారు. రణబాలి, జయమ్మలను మరో 29 రోజుల్లో చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated Date - Sep 17 , 2026 | 04:24 PM