సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హానెస్టీ ‘అహంకారం’గా.. ఆత్మవిశ్వాసం ‘బలుపు’గా అనిపిస్తే.. నేను తగ్గాలా?: విజయ్ దేవరకొండ

ABN, Publish Date - Oct 08 , 2026 | 08:25 PM

తనపై జరిగే ఉద్దేశపూర్వక నెగెటివ్ ప్రచారంపై విజయ్ దేవరకొండ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Vijay Deverakonda at Ranabaali Event

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా.. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ (Ranabaali). టి-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా పర్వదినం కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ (Ranabaali Trailer Launch) ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు, ముఖ్యంగా తనపై జరిగే ఉద్దేశపూర్వక నెగెటివ్ ప్రచారంపై ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రైలర్ లాంచ్ వేదికగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘మరో 8 రోజుల్లో అక్టోబర్ 16న దసరా పండుగకు ‘రణబాలి’ మీ ముందుకు వస్తున్నాడు. మనకు ఏ చరిత్రనైతే తెలియకుండా దాచిపెట్టారో.. ఏ వీరుల పేర్లు మనకు గుర్తుండకూడదని అనుకున్నారో.. ఏ కథలైతే జానపదాల్లో, బుర్రకథల్లో మాత్రమే ఉంటూ మరుగునపడిపోయాయో.. ఆ చరిత్రను సరిదిద్ది, ఆ వీరులను ప్రపంచానికి పరిచయం చేసి సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నమే ఈ ‘రణబాలి’. ఆ బుర్రకథల్ని, మన ఘనమైన చరిత్రను ప్రపంచమంతా బిగ్ స్క్రీన్‌పై చూసి ఒక గొప్ప ప్రపంచంలోకి వెళ్లేలా ఈ సినిమా ఉండబోతోంది.


టాక్సీవాలా కథ విన్నప్పుడే రాహుల్ ఎంత మంచి రైటరో నాకు అర్థమైంది. కానీ ‘రణబాలి’ కథ చెప్పినప్పుడు మాత్రం మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన అత్యుత్తమ స్క్రిప్ట్‌లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. కథే కాదు.. రణబాలి, జయమ్మ, హెక్టార్, మద్దిలేటి, అలాగే మా అమ్మ రాజమ్మ పాత్ర చేసిన ఈశ్వరి రావు.. ఇలా ప్రతి క్యారెక్టర్‌ను, మా ఊరైన శింగనమలను రాహుల్ అద్భుతంగా రాశాడు. ఆ కాలం నాటి కరవును మన సంస్కృతితో ముడిపెట్టి, ఎంతో మాసీగా, హీరోయిక్‌గా తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ రవి నా దగ్గరకు వచ్చారు. ‘ఆ గుర్రం, కత్తులు, విజయ్ గారు గుర్రం మీద స్వారీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి’ అంటూ ఆయన ఎగ్జైట్ అయ్యి చెప్పారు. కొన్ని స్క్రిప్ట్‌లు మనకు రాసిపెట్టి ఉంటాయి అంటారు. నా, రష్మిక కెరీర్ ఫిల్మోగ్రఫీలోనే ‘రణబాలి’ ఒక పెద్ద ల్యాండ్‌మార్క్‌గా, హైలైట్‌గా నిలిచిపోతుంది. మనం ఎలాంటి కష్టాలను దాటుకుని ఇక్కడికి వచ్చాం, మనలో ఎలాంటి వీరుల డీఎన్ఏ ఉంది అనేది తెలుసుకోవడానికి కుటుంబంతో సహా పిల్లలందరికీ ఈ సినిమా చూపించండి’’ అని పిలుపునిచ్చారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈవెంట్‌కు రాలేకపోయిన రష్మిక (జయమ్మ) తరఫున విజయ్ క్షమాపణలు చెప్పారు.


నా ఆత్మవిశ్వాసం ‘బలుపు’ అనిపిస్తే తగ్గాలా?

ఇక తనపై, తన సినిమాలపై కొందరు కావాలని చేస్తున్న నెగెటివ్ క్యాంపెయినింగ్‌పై విజయ్ దేవరకొండ ఏమాత్రం మొహమాటం లేకుండా నిప్పులు చెరిగారు. ‘‘సోషల్ మీడియాలో కావాలని నెగెటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇలాంటి పనులు మానుకుని మీ జీవితాలు ఎలా గొప్పగా తీర్చిదిద్దుకోవాలో ప్రయత్నం చేయండి. కొందరు ఉద్దేశపూర్వకంగా గ్రూపులుగా ఏర్పడి నాపై నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. నా కలలు, నా కష్టం వాళ్లకు అనవసరం అనిపిస్తే నేను పని చేయడం ఆపేయాలా? నేను నిక్కచ్చిగా మాట్లాడే హానెస్టీ వాళ్లకు ‘అహంకారం’ అనిపిస్తే.. నాకున్న ఆత్మవిశ్వాసం వాళ్లకు ‘బలుపు’ అనిపిస్తే నేను తగ్గాలా? నా జర్నీ, నా స్ట్రగుల్ వాళ్లకు అర్థం కాకపోతే నేను చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోవాలా? నేను నా మార్గాన్ని మార్చుకోను.. మారాల్సింది మీరు! ఎదుటివాడి కాళ్లు పట్టుకుని వెనక్కి లాగే పనులు చేయడం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు కూడా బాగుపడితే మీ కుటుంబాలు, మీ స్నేహితులు బాగుంటారు. అలాంటి విష సంస్కృతిని వీడండి’’ అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం

‘రామాయణ’ నిర్మాత ఆఫీసుల్లో ఐటీ దాడులు.. స్టాక్ మార్కెట్‌‌పై ప్రభావం

ఆ డైరెక్టర్‌కు నో చెప్పిన రామ్ చరణ్.. కారణం అదేనా?

Updated Date - Oct 08 , 2026 | 08:25 PM