Vijay Devarakonda: డిజిటల్ రూపంలో జరిగే లైంగిక దాడితో సమానం
ABN , Publish Date - Oct 04 , 2026 | 02:44 PM
ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీని అసభ్యంగా చూపిస్తూ కొందరు నెట్టింట పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీని అసభ్యంగా చూపిస్తూ కొందరు ఏఐ వీడియోని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయనకు సపోర్ట్‌కు ఇండస్ట్రీ కూడా కదులుతోంది. తాజాగా ఈ ఘటనపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), కల్యాణ్ రామ్ (kalyan Ram) కూడా స్పందిస్తూ ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు.
‘‘మనం పూర్తిగా నీచమైన స్థాయికి దిగజారిపోయాం. దీనికి బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టకూడదు. వారు చట్టపరంగా సాధ్యమైనంత కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాలి. ఇలాంటి వారికి గట్టి గుణపాఠం చెప్పేలా వారిని ఉదాహరణగా నిలపాలి. ఈ విషయాన్ని మనం ఇంతటితో వదిలేయకూడదు. మన పట్ల మనం ఇంతలా సున్నితత్వాన్ని ఎప్పుడు కోల్పోయాం? అసలు ఎలాంటి పెంపకం సాగుతోంది? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం? ఒకరినొకరు అవమానించడంలోనే ఆనందాన్ని వెతుక్కునే స్థాయికి మనం ఎలా చేరుకున్నాం? ప్రపంచం మొత్తం AI వల్ల ఉపాధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందా అనే విషయాలపై చర్చిస్తూ, ఆందోళన చెందుతున్న సమయంలో.. కొందరు మూర్ఖులు అదే సాంకేతికతను ఉపయోగించి ఇలాంటి పూర్తిగా అర్థంలేని పనులకు పాల్పడుతున్నారు. ఇది డిజిటల్ రూపంలో జరిగే లైంగిక దాడితో సమానం. ఇలాంటి చర్యలను చట్టం అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి, అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న బృందానికి నా సంపూర్ణ మద్దతు ఉంది.మనం ఎంత దిగజారిపోయాం? ఈ పని చేసిన వారిని వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి. అలా చేస్తే మరొకరు ఇలాంటి తప్పు చేయరు. ఇతరులను కించపరచడంలో ఆనందం వెతికే సమాజంలో మనం ఉన్నామా? ఏ తరహా పెంపకం ఇది? ప్రపంచం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడుతుంటే, కొందరు ఆ టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నారు. ఇది డిజిటల్ లైంగిక దాడితో సమానం’’ అని పేర్కొన్నారు.
ఇదే విషయంపై ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. ‘‘ఏఐని ఉపయోగించి ఒక మహిళను ఈ విధంగా అవమానించడం అత్యంత దారుణమైన పని. ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి త్వరలోనే కఠినమైన నిబంధనలు వస్తాయని నేను ఆశిస్తున్నాను’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
Varanasi: మహేష్ ‘రుద్ర’ పాత్రపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
Drishyam 3: అక్షయ్ ఖన్నా తప్పిదం.. జైదీప్‌కు జాక్‌పాట్
రెండు పార్టులుగా సాయిపల్లవి రెండు సినిమాలు