సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vanda Devullu Trailer: మగాడికి జీవితాన్ని ఇచ్చే ఆడదాని కథ..

ABN, Publish Date - Jun 08 , 2026 | 06:33 PM

బిచ్చగాడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో విజయ్ ఆంటోనీ (Vijay Antony)- డైరెక్టర్ శశి (Sasi). తల్లి సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వంద దేవుళ్ళు (Vanda Devullu)అనే సినిమాతో ఈ కాంబో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Vanda Devullu

బిచ్చగాడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో విజయ్ ఆంటోనీ (Vijay Antony)- డైరెక్టర్ శశి (Sasi). తల్లి సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వంద దేవుళ్ళు (Vanda Devullu)అనే సినిమాతో ఈ కాంబో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ, స్వసిక జంటగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో నూరు సామిగా రిలీజ్ అవుతుండగా తెలుగులో వంద దేవుళ్ళు పేరుతో విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా వంద దేవుళ్ళు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పల్లెటూరు నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. మొదట్లోనే అమ్మని దైవంలా చూశాడు.. బిచ్చగాడు కథ అయితే.. అమ్మని మనిషిలా చూడడం మొదలుపెట్టారు.. వంద దేవుళ్ళు కథ అని చెప్పారు. భర్త తోడు లేకుండా ఇద్దరు మగపిల్లలను పెంచే ఒక తల్లి.. 40 ఏళ్ళ వయస్సులో తన వయస్సులోనే ఉన్నఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ విషయం ఇంట్లో తెలిసి ఇద్దరు కొడుకులు.. తల్లిని నిందిస్తారు. గ్రామం మొత్తం ఆమెను తప్పుగా చూస్తుంది. ఆ సమయంలో కొడుకులు తల్లిని ఎలా అర్ధం చేసుకున్నారు.. ? చివరకు తల్లి ప్రేమను అంగీకరించారా.. ? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


బిచ్చగాడు లాగే ఈ సినిమా కూడా బలమైన మదర్ సెంటిమెంట్‌తో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెకు హత్తుకునే ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉండనున్నాయి. ఒక వయస్సు వచ్చాకా.. తల్లి- కొడుకుల మధ్య బంధం ఎలా ఉంటుంది.. ? అమ్మ మనసును అర్ధం చేసుకుంటున్న కొడుకులు ఎంతమంది.. ? ఇలాంటి అంశాలు అన్ని ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తోంది. విజయ్ - స్వసిక నటన గురించి చాలాకాలం మాట్లాడుకొనేలా ఉంది. జూన్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో బిచ్చగాడు కాంబో మరో హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.

Updated Date - Jun 08 , 2026 | 06:56 PM