వెంకీ అనిల్ 5.. సెట్ లో అడుగుపెట్టిన వెంకీ మామ
ABN, Publish Date - Jul 07 , 2026 | 06:05 PM
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న సరికొత్త మల్టీస్టారర్ ప్రాజెక్ట్ వెంకీఅనిల్5(VenkyAnil5).
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న సరికొత్త మల్టీస్టారర్ ప్రాజెక్ట్ వెంకీఅనిల్5(VenkyAnil5). విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోలుగా నటిస్తున్న ఈ క్రేజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విక్టరీ వెంకటేష్ ఈరోజు నుంచే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ సెట్స్‌లోకి ఆడగుపెట్టాడు. వెంకీ ఎంట్రీతో సెట్స్ లో హంగామా మొదలైందని, ఈ షెడ్యూల్ సినిమాలోనే అత్యంత కీలకం కాబోతుందని సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన ఒక భారీ సెట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. విక్టరీ వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, క్రేజీ హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలపై కీలకమైన, మేజర్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతీ సీన్ థియేటర్లలో నవ్వుల పూయించడమే కాకుండా, సినిమాకే మేజర్ హైలైట్ అవ్వబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక వెంకీఅనిల్5 సినిమాను 2027 సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే విక్టరీ వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ వినోదానికి కేరాఫ్ అడ్రస్, దానికి తోడు కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ టైమింగ్ తోడవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతి వినోదం మాములుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ అందుకొనే అనిల్ రావిపూడి మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.