సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నంద్యాల ఎగ్జిబిటర్ జి.పుల్లారెడ్డి ఇక లేరు

ABN, Publish Date - Jul 28 , 2026 | 06:35 PM

నంద్యాల పట్టణంలో అతిపురాతనమైన థియేటర్ ఏదంటే రామనాథ్ టాకీస్. జనం ఈ థియేటర్ ను ఇప్పటికీ 'రెడ్డి హాల్' అని పిలుస్తూ ఉంటారు.

నంద్యాల పట్టణంలో అతిపురాతనమైన థియేటర్ ఏదంటే రామనాథ్ టాకీస్. జనం ఈ థియేటర్ ను ఇప్పటికీ 'రెడ్డి హాల్' అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ థియేటర్ యజమాని అయిన జి.పుల్లారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హఠాన్మరణం చెందారు. నంద్యాల క్రేజీ థియేటర్ గా పేరొందిన రామనాథ్ టాకీస్ లో ఆ నాటి 'లవకుశ' మొదలు అనేక చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. రాయలసీమ ఎగ్జిబిటర్స్ లో ప్రముఖులుగా పుల్లారెడ్డి పేరొందారు.

తమ పెద్దవారి నుండి తన టీనేజ్ లోనే రామనాథ్ థియేటర్ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు పుల్లారెడ్డి. అప్పటి నుంచీ వందలాది సూపర్ హిట్ మూవీస్ ను రామనాథ్ థియేటర్ లో ప్రదర్శించారు. నంద్యాల పట్టణంలోని అందరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ కు పుల్లారెడ్డి అత్యంత సన్నిహితులు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల నంద్యాల ప్రముఖులు తీవ్రసంతాపం తెలిపారు. పుల్లారెడ్డి సోదరుడు జి.శ్రీనివాసరెడ్డి అభిరామ్ థియేటర్ యజమాని. వారి సమీపబంధువు వి.ప్రతాప్ రెడ్డి - ప్రతాప్, మినీ ప్రతాప్, నిధి థియేటర్ల ఓనర్. వీరి సినిమా హాళ్ళు నంద్యాల పట్టణంలో పేరొందిన క్రేజీ థియేటర్స్. ఏ సినిమా టాక్ నైనా నిక్కచ్చిగా చెప్పేవారు పుల్లారెడ్డి. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ తో ఆయనకు సన్నిహితసంబంధాలు ఉండేవి.

Updated Date - Jul 28 , 2026 | 06:36 PM