సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక

ABN, Publish Date - Jun 22 , 2026 | 03:41 PM

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం చుట్టూ సోషల్ మీడియాలో కొన్ని నకిలీ క్యాస్టింగ్ కాల్స్ చక్కర్లు కొడుతున్నాయి.

VenkyAnil5 Latest Update

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలయికలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం (#VenkyAnil5 / #NKRAR2) చుట్టూ సోషల్ మీడియాలో కొన్ని నకిలీ క్యాస్టింగ్ కాల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఆడిషన్స్ ప్రకటనలను సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలైన ‘షైన్ స్క్రీన్స్’, ‘Z స్టూడియోస్’ దృష్టికి రావడంతో వెంటనే యూనిట్ రియాక్టైంది. సదరు నకిలీ క్యాస్టింగ్ కాల్స్‌కు తమ చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.


సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే వారు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. తమ సినిమా తరఫున క్యాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న వ్యక్తులకు ఎవరూ కూడా తమ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఆధార్ వంటి పత్రాలు లేదా డబ్బులు ఇవ్వవద్దని గట్టిగా కోరింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సినిమా పరిశ్రమలోకి రావాలనుకునే వారికి సూచించింది.


తమ చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక క్యాస్టింగ్ ప్రకటనలు ఉంటే, అవి కేవలం తమ అధికారిక, ధృవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటించబడతాయని మేకర్స్ స్పష్టం చేశారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కేవలం అధికారిక ఛానెల్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. సినిమా అలా సెట్స్‌పైకి వెళ్లిందో, లేదో.. నకిలీ క్యాస్టింగ్ కాల్ దర్శనమివ్వడంతో.. వెంటనే చిత్రబృందం అలెర్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

అందరి ముందు శ్రీలీలను అవమానించిన సీఎం భార్య..

చిరంజీవితో బీజేపీ నేతల సమావేశం!


Updated Date - Jun 22 , 2026 | 03:41 PM