Venky Atluri: దీపిక 8 గంటల షిఫ్ట్ వివాదంపై వెంకీ అట్లూరి రియాక్షన్

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:02 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 8 గంటల షూటింగ్ షిఫ్ట్ లపై చేసిన పెద్ద దుమారమే లేపాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 8 గంటల షూటింగ్ షిఫ్ట్ లపై చేసిన పెద్ద దుమారమే లేపాయి. రోజుకు 8 గంటలకు మించి షూటింగ్ చేయనని ఆమె చెప్పడం, ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', 'కల్కి 2' సినిమాల నుంచి తప్పుకోవడం మరింత హాట్ టాపిక్‌గా మార్చింది. కొందరు దీపిక నిర్ణయాన్ని సమర్థిస్తే, మరికొందరు సినిమా షూటింగ్‌లో ఎక్కువ గంటలు పనిచేయడం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు. ఆగస్టు 14న విడుదల కానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ అనుపమ చోప్రా అడిగిన ప్రశ్నకు వెంకీ అట్లూరి తెలివైన సమాధానం ఇచ్చారు.

"తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఉదయం 8 గంటలకు షూటింగ్ పనులు ప్రారంభమవుతాయి. టెక్నీషియన్లు, నటీనటులు తమ తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తిస్తారు. సాధారణంగా రోజుకు 10 నుంచి 12 గంటల వరకు షూటింగ్ జరుగుతుంది. ఇది మా ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్న విధానం. ఒకవేళ నేను  హిందీలో సినిమా చేస్తే అక్కడి పని విధానానికి అనుగుణంగా మారుతాను.  అక్కడ కల్చర్, వర్కింగ్ స్టాండర్డ్స్ తెలుసుకుంటా. ఈ  విధంగా తెలుగు చిత్రసీమలో పనిచేసే ఇతర భాషల నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఇక్కడి వర్కింగ్ కల్చర్‌ను గౌరవించి దానికి తగ్గట్టుగా పనిచేయాలి. తమిళం, మలయాళం, హిందీ... ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా తెలుగు సినిమా పని విధానానికి అలవాటు పడతారు' అని అని వెంకీ అట్లూరి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇవి కూడా చదవండి:

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

యంగ్ టైగర్ వదిలిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Updated Date - Jul 31 , 2026 | 12:12 PM