చిరంజీవితో వెంకీ అట్లూరి సినిమా.. ఎందుకు ఆగిందంటే

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:02 PM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడారు.

Venky Atluri on Project with Chiru

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి, తాజాగా వచ్చిన సూర్య (Suriya) ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons)తో కూడా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌తో సంతోషంగా వెంకీ అట్లూరి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, చిత్ర విశేషాలను తెలుపుతున్నారు. ఇలాంటి ఓ ఇంటర్వ్యూలో రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదో వివరించారు.


మెగాస్టార్‌తో అనుకున్న ప్రాజెక్ట్ గురించి వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్న మాట నిజమే. 80స్ కాలంలో పెరిగిన వ్యక్తిగా చెబుతున్నాను.. మెగాస్టార్ మాకు చిన్ననాటి ఆరాధ్య దైవం. అయితే ఆయన లాంటి పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేయాలంటే సరైన సబ్జెక్ట్‌తో పాటు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి. ఆ స్థాయి స్టార్‌ను, ఆ భారీ బడ్జెట్‌ను హ్యాండిల్ చేయడానికి దర్శకుడిగా నాకు ఇంకాస్త మెచ్యూరిటీ అవసరమనిపించింది. ఆ సబ్జెక్ట్, ఆయన ఇమేజ్ రెండింటికీ న్యాయం చేయగలమా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు.


కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదగడంపైనే తనకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారిగా పెద్ద జంప్ తీసుకుంటే అనుభవలేమితో బడ్జెట్ వృధా అయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే మొదటి మూడు సినిమాల బడ్జెట్‌లను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చానని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కోసం అనుకున్న ఆ ప్రాజెక్ట్ ఒక థ్రిల్లర్ జానర్‌కు చెందినదని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు. సరైన అనుభవం, మెచ్యూరిటీ సాధించాకే అలాంటి భారీ ప్రాజెక్టును మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాను ఆపినట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక.. తరలివచ్చిన తారాతోరణం

ఇండియాలో ఇద్దరు హీరోల వయసే వెనక్కి వెళుతోంది: త్రివిక్రమ్

పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..

Updated Date - Aug 16 , 2026 | 01:02 PM