మాస్ కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌గా 'హరుడు'

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:05 PM

వెంకట్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'హరుడు'. హెబ్బపటేల్‌, సలోని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 8న విడుదల కాబోతోంది.

Venkat in and as Harudu

'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్... ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించాడు. కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ యాక్టర్‌గానూ చేశాడు. గత యేడాది వచ్చిన 'ఓజీ'లో నటించిన వెంకట్‌ తాజాగా 'హరుడు' అనే చిత్రంలో హీరోగా యాక్ట్ చేశౄడు. వి.ఆర్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ సినిమాకు రాజ్‌ తాళ్ళూరి దర్శకుడు. ఇప్పటికీ ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేశారు.


మాస్‌ కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకున్న 'హరుడు' సినిమాను మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్‌ చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారికి ఇది మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది’ అని అన్నారు. హెబ్బ పటేల్‌, సలోని, శ్రీహరి, నటాషా, అలీ, సుమన్, రవివర్మ, శుభశ్రీ, వేద్విక, చాందినీరావు, షాని, రవి, సమ్మెట గాంధీ, 'దిల్‌' రమేశ్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Mar 30 , 2026 | 05:08 PM