సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maala Song: త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి పాట ఏంటి?

ABN, Publish Date - Nov 24 , 2026 | 02:47 PM

వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో చోటు దక్కని ‘మాలా వచ్చా చూడు’ పాట యూట్యూబ్‌లో విడుదలైన తర్వాత మరోసారి ట్రోలింగ్‌కు గురవుతోంది.

విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోని ‘మాలా వచ్చా చూడు’ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సినిమాలో కనిపించని ఈ పాటను  యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మరోసారి ట్రోల్ అవుతోంది. వెంకటేష్, నివేత పేతురాజుపై 'మాలా వచ్చా  చూడు'  పాటను  చిత్రీకరించారు. దానికి సంబందించిన ప్రోమోను వదిలాక ఈ పాటపై విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమాల నుంచి ఆశించే స్థాయిలో ఈ పాట లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. పాట కాన్సెప్ట్, చిత్రీకరణ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలోనే చివరకు సినిమాకు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్‌లో ఈ పాటకు చోటు దక్కలేదు. అయితే తాజాగా చిత్రబృందం ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయడంతో పాత విమర్శలన్నీ మరోసారి తెరపైకి వచ్చాయి.

పాట చూసిన నెటిజన్లు అసలు ఇలాంటి పాటను ఎలా రూపొందించారు? వెంకటేష్ వంటి సీనియర్ హీరో ఇలాంటి పాటలో నటించడానికి ఎలా అంగీకరించారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పాటను తొలగించడం సరైన నిర్ణయమని, ఈ పాటను సినిమాలో ఉంచి ఉంటే ఇంకా నెగటివ్ టాక్ వచ్చేదని చెబుతున్నారు. అయితే ఈ పాటలో సత్య చేసిన హంగామా  ప్రత్యేక ఆకర్షణగా మారిందని చెబుతున్నారు. స్పైడర్‌మ్యాన్, అత్తరు సాయిబు వంటి విభిన్న గెటప్పులతో పాటు చీరకట్టులోనూ సత్య కనిపించి మెప్పించారు. ఒక పాట కోసం సత్యతో ఇన్ని రకాల వేషాలు వేయించినా.. చివరకు అది సినిమాలోనే లేకుండా పోవడంతో ఆయన చేసిన ప్రయత్నమంతా వృథా అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అలాగే బ్రహ్మాజీ పై తీసిన కొన్ని సీన్స్ ఎడిటింగ్లో కట్ చేసేశారట.  అవి కూడా సినిమాలో కనిపించలేదని సమాచారం. అలాగే వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఎడిటింగ్‌లో తొలగించినట్లు తెలుస్తోంది. ఇలా పలువురు నటీనటులపై చిత్రీకరించిన సన్నివేశాలు, పాటలు చివరకు సినిమాలో లేకపోవడం నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి థియేటర్లలోకి రాకుండా ఆగిపోయిన ‘మాలా వచ్చా చూడు’ పాట ఇప్పుడు యూట్యూబ్‌లోకి రావడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - Nov 24 , 2026 | 04:42 PM