సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆదర్శ కుటుంబం.. గురూజీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా

ABN, Publish Date - Oct 30 , 2026 | 10:01 AM

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి హిట్స్ తరువాత విక్టరీ వెంకటేష్(Venkatesh) - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam).

Aadarsha Kutumbam

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి హిట్స్ తరువాత విక్టరీ వెంకటేష్(Venkatesh) - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమాలో వెంకటేష్ సరసన కథానాయికగా శ్రీనిధిశెట్టి నటించగా.. నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు అక్టోబర్ 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. అయితే ఎక్కువ శాతం మంది పాజటివ్ టాక్ ని ఇవ్వడంతో ఆదర్శ కుటుంబం మంచి హిట్ నే అందుకోబోతుందని అంటున్నారు.


కొంతమంది ఆడియన్స్ మొదటి హాఫ్ చాలా సూపర్ హిట్‌గా ఉందని, వెంకీ మామ వింటేజ్ వైబ్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఊహించని విధంగా వచ్చిన ఫన్నీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. వెంకీ మామ వన్ మ్యాన్ షో అని, కొన్నిచోట్ల చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా థియేటర్‌లో ఒకసారి చూడదగ్గ చిత్రంగా ఉంటుందని, ఓటీటీలో అయితే మరింత బాగా వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.


అయితే మరోవైపు, సెకండ్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగిందని, కొన్ని జోక్స్ వర్కౌట్ అయినప్పటికీ రొటీన్ మరియు యావరేజ్ స్టోరీగా మిగిలిపోయిందని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నివేతా పేతురాజ్ ట్రాక్ కథకు అంతగా సంబంధం లేదని, కేవలం గ్లామర్ అట్రాక్షన్ కోసం, ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి మాత్రమే ఇరికించినట్లు ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు. నలుగురు వ్యక్తులు ఒక కుటుంబంగా ఎలా మారారనే ప్రధాన పాయింట్‌లో కొత్తదనం కొరవడిందని, కథనం చాలా వరకు ఊహించదగినదిగా, రొటీన్‌గా సాగడం కొద్దిగా నిరాశపరుస్తుందని అంటున్నారు.


త్రివిక్రమ్ తనదైన రైటింగ్‌తో అనుకున్నంత మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాను నిలబెట్టాయని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఆదర్శ కుటుంబం ఫస్ట్ హాఫ్ అదుర్స్ అనిపించినా, సెకండ్ హాఫ్‌లో డల్ అవ్వడం వల్ల సినిమాపై మిక్సెడ్ టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ హిట్ ట్రాక్ ఎక్కినట్లే అని టాక్ నడుస్తోంది. మరి మొదటి రోజు తరువాత కలక్షన్స్ ఎంత రాబట్టింది అన్నదాని బట్టి ఆదర్శ కుటుంబం హిట్టా.. ఫట్టా అనేది చూడాలి.

Updated Date - Oct 30 , 2026 | 10:01 AM