సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి.. వెంకీ మాస్ లుక్ అదిరింది

ABN, Publish Date - Aug 14 , 2026 | 06:12 PM

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధించి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

Venkatesh

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (venkatesh) ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధించి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వీరిద్దరిది తిరుగులేని హిట్ కాంబినేషన్ కావడంతో.. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న వెంకీఅనిల్ 5 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తోన్న ఈ భారీ వినోదాత్మక చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు కూడా అద్భుతమైన స్పందన లభించింది.


ఇక తాజాగా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ 40 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి రగ్గడ్ లుక్ లో పవర్ ఫుల్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. పోస్టర్‌లోని ఆర్మీ ఇన్‌సిగ్నియా, రాకీ టెర్రైన్ బ్యాక్‌డ్రాప్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్‌గా చూపిస్తున్నాయి.


వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్, వారి మధ్య ఉండే కామెడీ, కెమిస్ట్రీ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హ్యూమర్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో రూపొందుతున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనిల్ - వెంకీ మరో హిట్ అందుకుంటారేమో చూడాలి.

Updated Date - Aug 14 , 2026 | 06:12 PM