Venkatesh: కజకిస్థాన్‌లో వెంకటేశ్.. కళ్యాణ్ రామ్ సందడి..
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:16 PM
తాజాగా 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్ . ఇప్పుడు 'జనవరి 12 విడుదల' సినిమాతో బిజీ కానున్నారు.
తాజాగా 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఇప్పుడు 'జనవరి 12 విడుదల' (January 12 vidudala) సినిమాతో బిజీ కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి కల్యాణ్‌రామ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం వెంకటేశ్ కజకిస్థాన్ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ చిత్ర బృందం షూటింగ్లో పాల్గొంటుండగా.. తాజాగా వెంకటేశ్ కూడా వారితో జాయిన్ అయ్యారు. ఈ రోజు నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నట్లు తెలిసింది. ఆదివారం మొదలైన షెడ్యూల్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
ఈ షెడ్యూలుతో సినిమా పూర్తికానుందని తెలుస్తోంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లను కూడా వేగవంతం చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలో ఓ పాటతో మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గం నుంచి సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 12ను విడుదల చేయనున్నారు.
ALSO READ:
మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో శ్రీలీల కాదా.. ఆ బాలీవుడ్ బ్యూటీయేనా?
‘ఆదర్శ కుటుంబం’లో ఆ పాటని పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?
ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. రంగంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్?