సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Korean Kanakaraju: వ‌రుణ్ తేజ్‌ కొరియ‌న్ క‌న‌క‌రాజు.. వ‌చ్చేశాడు

ABN, Publish Date - Jan 19 , 2026 | 10:57 AM

మ‌ట్కా డిజాస్ట‌ర్‌ త‌ర్వాత.. వ‌రుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని న‌టిస్తున్న చిత్రం కొరియ‌న్ క‌న‌క‌రాజు.

Korean Kanakaraju

నాలుగేండ్లుగా స‌రైన హిట్ కోసం ఎంతో ఆతృత‌తో ఎదురుచూస్తున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej). మ‌ట్కా డిజాస్ట‌ర్‌ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఆయ‌న న‌టిస్తున్న చిత్రం కొరియ‌న్ క‌న‌క‌రాజు (Korean Kanakaraju). వ‌రుణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ‌త సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 19న ఈ చిత్రం ప్రారంభం అయింది. గ‌తంలో సందీప్ కిష‌న్‌తో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', శ‌ర్వానంద్‌తో 'ఎక్స్‌ప్రెస్ రాజా', నానితో 'కృష్ణార్జున యుద్ధం', సంతోష్ శోభ‌న్‌తో 'ఏక్ మినీ కథ', 'లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్‌ , నితిన్‌తో 'మాస్ట్రో' వంటి సినిమాల‌ను డైరెక్ట్ చేసిన మేర్ల‌పాక గాంధీ (Gandi Merlapaka) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం.

కామెడీ, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తుండ‌గా 'మిరాయ్' భామ‌ రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్ గా నటిస్తోంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వేస‌విలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా సోమ‌వారం ఈ చిత్రం టైటిల్ రివీల్ చేస్తూ ఓ గ్లిమ్స్ వీడియోను విడుద‌ల చేశారు.

ఈ గ్లిమ్స్‌లో.. సౌత్ కొరియాలో జైలులో స‌త్య పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి క‌న‌క‌రాజు ఆచూకీ గురించి అడ‌గ‌డం, అక్క‌డే ఉన్న హీరోయిన్ రితికా వారి భాష‌ను త‌ర్జుమా చేసి చెప్ప‌డం,కొద్ది సేప‌టికి హీరో ఎంట్రీ ఇచ్చి క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లు న‌రుక్కుంటూ పోవ‌డం, కొరియ‌న్ భాష‌లో మాట్లాడ‌డం వంటి స‌న్నివేశాలు ఉండి వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Updated Date - Jan 19 , 2026 | 11:21 AM